ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించాలంటే నిజ జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది.ఎంతో కష్టపడి చదివితే మాత్రమే లక్ష్యాలను సాధించవచ్చు.
గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉండే పోటీ కూడా అంతాఇంతా కాదు.ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాక నిరాశకు గురయ్యే వాళ్లు సైతం చాలామంది ఉన్నారు.
అయితే ఒక రైతు బిడ్డ మాత్రం ఎంతో కష్టపడి లక్ష్యాలను సాధించాడు.
ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తన సక్సెస్ స్టోరీతో ఈ రైతు బిడ్డ ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఏపీలోని విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన కర్రి రఘునాథ్ శంకర్( Karri Raghunath Shankar ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.వ్యవసాయ కుటుంబంలో రఘునాథ్ శంకర్ జన్మించగా రఘునాథ్ శంకర్ తండ్రి కర్రి సత్యనారాయణ సాధారణ రైతు కావడం గమనార్హం.
శంకర్ తండ్రి ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించేవారు.ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా సాధించాలని కల కన్న శంకర్ ఎట్టకేలకు ఆ కలను నెరవేర్చుకున్నాడు.తండ్రికి వ్యవసాయ పనులలో చేదోడువాదోడుగా ఉన్న శంకర్ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలతో ప్రిపేర్ అయ్యి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు.కోచింగ్ లేకుండా నాలుగు ఉద్యోగాలను సాధించడం సులువైన విషయం కాదు.
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,( Sub Inspector Of Police ) ఇన్ కమ్ టాక్స్,( Income Tax ) సీబీఐలో గ్రేడ్ బి జాబ్, రైల్వే కమర్షియల్ అప్రెంటీస్ పోస్ట్ లకు రఘునాథ్ శంకర్ ఎంపికయ్యారు.ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో తాను ఎస్.ఐ ఉద్యోగాన్ని ఎంచుకున్నానని ఆయన తెలిపారు.నా సక్సెస్ కు కుటుంబ సభ్యులు కారణమని వాళ్ల ప్రోత్సాహంవల్ల నేను కోరుకున్న లక్ష్యాలను సాధించగలిగానని పేర్కొన్నారు.
గ్రంథాలయం నా కోచింగ్ సెంటర్ అని మామయ్యను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సక్సెస్ అయ్యానని రఘునాథ్ శంకర్ చెప్పుకొచ్చారు.