డ్రాగ‌న్ ఫ్రూట్ ఆరోగ్య‌మే.. కానీ ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?

డ్రాగ‌న్ ఫ్రూట్స్( Dragon Fruits ) చూడ‌టానికి ఎంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయో.తిన‌డానికి కూడా అంతే రుచిక‌రంగా ఉంటాయి.

 Who Should Avoid Dragon Fruit Dragon Fruit Details, Dragon Fruit Health Benefit-TeluguStop.com

ఇండియాతో స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో డ్రాన‌గ్ ఫ్రూట్స్ విరివిగా ల‌భ్య‌మ‌వుతున్నాయి.రుచి మ‌రియు పోష‌క గుణాలు కార‌ణంగా పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా డ్రాగ‌న్ ఫ్రూట్స్ ను తింటుంటారు.

డ్రాగ‌న్ ఫ్రూట్స్ లో మెగ్నీషియం, ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ సి, ప్రోటీన్, ఫైబ‌ర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా నిండి ఉంటాయి.

Telugu Dragonfruit, Tips, Latest-Telugu Health

గుండె ఆరోగ్యాన్ని( Heart Health ) పెంచ‌డంలో, జీర్ణ‌క్రియ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకలను బలోపేతం చేయ‌డంలో, చ‌ర్మాన్ని నిగారింపుగా మెరిపించ‌డంలో, జుట్టు రాల‌డాన్ని( Hair Fall ) అరిక‌ట్ట‌డంలో డ్రాగ‌న్ ఫ్రూట్ అద్భుతంగా తోడ్ప‌డుతుంది.అలాగే కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, దీర్ఘకాలిక వ్యాధులు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గించ‌డంలో, ప్రేగు కదలికలను ప్రోత్సహించ‌డంలో డ్రాగ‌న్ ఫ్రూట్ స‌హాయ‌ప‌డుతుంది.అయితే డ్రాగ‌న్ ఫ్రూట్ ఆరోగ్య‌క‌ర‌మే.

కానీ కొంద‌రు మాత్రం తిన‌కూడ‌దు.ఆ కొంద‌రు ఎవ‌రు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Dragonfruit, Tips, Latest-Telugu Health

ఏవైనా శస్త్రచికిత్సలు చేయించుకోవ‌డానికి సిద్ధం అవుతున్న వారు.రెండు వారాల ముందు నుంచి డ్రాగ‌న్ ఫ్రూట్స్ ను ఎవైడ్ చేయాలి.ఎందుకంటే, డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర నియంత్రణకు( Blood Sugar Levels ) ఆటంకం కలిగిస్తుంది.శస్త్రచికిత్స చేయించుకునేవారికి ఈ స‌మ‌స్య‌గా మారుతుంది.అలాగే మధుమేహం, అధిక రక్తపోటు తో బాధ‌ప‌డుతూ మందులు వాడుతున్న వారు డ్రాగన్ ఫ్రూట్ తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ దురద, వాపు మరియు దద్దుర్లు వంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది.

అందువ‌ల్ల ఫుడ్ అల‌ర్జీ చ‌రిత్ర ఉన్న వ్య‌క్తులు డ్రాగ‌న్ ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి.డ్రాగన్ ఫ్రూట్‌లో ఆక్సలేట్ ఉంటుంది, అందువ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న వారు డ్రాగ‌న్ ఫ్రూట్స్ ను తిన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube