అతి త్వరలోనే తెలంగాణ క్యాబినెట్( Telangana Cabinet ) ను విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కసరత్తు చేస్తున్నారు ఇదే విషయమే అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు ఆయన ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు,హైడ్రా, మూసి నది ప్రక్షాళన వంటి విషయాల పైన సమగ్రంగా చర్చించనున్నారు ఎప్పటి నుంచో మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్ భావిస్తున్నా, ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూ వస్తోంది.
అయితే ఈ దసరా లోపు మంత్రివర్గన్ని విస్తరించి, పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.ఈ మేరకు ఆరు మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తో పాటు, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం 12 మంది కొలువు తీరారు.మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి .వీటిని కూడా ఒకేసారి భర్తీ చేసి పూర్తిగా పాలన పైనే దృష్టి సారించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది.
దీంతో క్యాబినెట్ ను విస్తరించి మరి కొంతమందికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం పైనే రేవంత్ దృష్టి సారించారు. తనకు సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పించే విషయంలో రేవంత్ సక్సెస్ అయ్యారు .దీంతో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలోను తనుకు అనుకూలమైన వారిని మంత్రులుగా చేయాలనే ఆలోచనతో ఉన్నారు.ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు .ఆయన కొద్ది రోజుల్లోనే ఢిల్లీకి చేరుకుంటారు .ఆయన వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు క్యాబినెట్ విస్తరణ పై చర్చించనున్నట్లు సమాచారం. ఆశావాహల సంఖ్య పెరుగుతుండడం, మంత్రి పదవుల విషయమై తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో, ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయం పైన ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేతో పాటు , మరికొంతమంది కాంగ్రెస్ పెద్దలతోనూ రేవంత్ చర్చించుకున్నట్లు సమాచారం.
సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేసే విధంగా రేవంత్ మంత్రివర్గాన్ని విస్తరించ ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి , నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎవరికి ప్రాధాన్యం దక్కలేదు .దీంతో ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయా జిల్లాల కు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట.ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,గడ్డం వినోద్, గడ్డం వివేక్ , ప్రేమ్ సాగర్ రావు , బాలు నాయక్, రామచంద్రనాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి , సుదర్శన్ రెడ్డి , దానం నాగేందర్ వాకాటి శ్రీహరి లు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.