వయసు పైబడిన తర్వాత వైట్ హెయిర్( White hair ) రావడం అనేది చాలా కామన్.కానీ ఇటీవల రోజుల్లో ఎంతో మంది యంగ్ ఏజ్ లోనే ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ఇందుకు అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండనప్పటికీ.పెయిన్ మాత్రం ఓకే విధంగా ఉంటుంది.
తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది.తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
కానీ ఒత్తిడికి గురైతే జుట్టు తెల్లబడే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండండి.
ఇక జుట్టు తెల్లబడటం ఆగాలంటే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
![Telugu Black, Care, Care Tips, Healthy, White-Telugu Health Telugu Black, Care, Care Tips, Healthy, White-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/10/home-remedies-stop-white-hair-white-hair-hair-graying-hair-care-hair-care-tips-healthy-hair.jpg)
ఉసిరి.వైట్ హెయిర్ కు చెక్ పెట్టడంలో చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.రెండు ఉసిరికాయలు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి సన్నగా కట్ చేసుకోవాలి.ఈ ఉసిరికాయ ముక్కలను ఒక గ్లాస్ వాటర్ లో 15 నిమిషాల పాటు మరిగించి వడకట్టాలి.
ఈ వాటర్ ను ఒకటికి రెండుసార్లు జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే ఉసిరిలో ఉండే యాంటాసిడ్స్ జుట్టు నెరసిపోకుండా కాపాడతాయి.తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మారుస్తాయి.
![Telugu Black, Care, Care Tips, Healthy, White-Telugu Health Telugu Black, Care, Care Tips, Healthy, White-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/10/white-hair-hair-graying-hair-care-hair-care-tips-healthy-hair-hair-mask-black-hair.jpg)
జుట్టు తెల్లబడడం ఆగాలంటే కచ్చితంగా కరివేపాకు నూనెను వాడండి.కరివేపాకు నూనెలో మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడే బయోయాక్టివ్ సమ్మేళనాలు నిండి ఉంటాయి.వారానికి రెండుసార్లు కరివేపాకు నూనెను జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం గాఢత తక్కువ ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి.
ఈ విధంగా చేస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.కురులు నల్లగా మారతాయి.ఇక జింక్, క్యాల్షియం, సెలెనియం, క్రోమియం వంటి పోషకాలు వైట్ హెయిర్ ప్రాబ్లం ను దూరం చేస్తాయి.ఈ పోషకాలన్నీ కలబందలో ఉంటాయి.
కాబట్టి ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ వేసుకోండి.అలాగే పావు కప్పు కాఫీ డికాక్షన్ మరియు పావు కప్పు ఫ్రెష్ కలబంద ( Aloe vera )వేసి బాగా మిక్స్ చేసుకోండి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తల స్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.మరియు తెల్ల బడిన జుట్టు నల్లగా సైతం మారుతుంది.