ప్రేమికుల రోజు( Valentines Day ) ఎంతోమందికి ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే.భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ మధ్య కాలంలో లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించిన సినిమాగా సీతారామం( Sitaramam ) నిలిచింది.సీతారామం సినిమా కలెక్షన్ల విషయంలో సైతం సత్తా చాటింది.
హను రాఘవపూడి స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
నాగచైతన్య ఏ మాయ చేశావె( Ye Maaya Chesave ) సినిమా కూడా లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులను మాయ చేసింది.
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తమిళంలో 96 సినిమా ప్రేమ కథలలో క్లాసిక్ గా నిలిచింది.
తెలుగులో ఈ సినిమా జాను( Jaanu ) పేరుతో రీమేక్ కాగా ఈ రీమేక్ ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.

తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన రాజా రాణి సినిమా( Raja Rani ) కూడా ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.సూర్య హీరోగా తెరకెక్కిన గజిని సినిమా( Ghajini ) ప్రేమ కథలలో స్పెషల్ మూవీగా నిలిచింది.మురుగదాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలోని స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
నాగార్జున గీతాంజలి( Geethanjali ) కూడా ప్రేమకథలలో ప్రత్యేక సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ లవ్ స్టోరీలు తెరకెక్కుతాయేమో చూడాల్సి ఉంది.టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతుండగా ఈ మధ్య కాలంలో సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ( Baby Movie ) లాంటి విభిన్నమైన ప్రేమకథా సినిమాలు తెరకెక్కి కలెక్షన్ల పరంగా అదరగొట్టాయి.టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.