విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా వచ్చిన లైలా సినిమా( Laila Movie ) ఈరోజు రిలీజ్ అయింది.మాస్ కా దాస్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో కొంతవరకు సాఫ్ట్ ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు.
మరి ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ రావడం తద్వారా ఆయన మంచి హైప్ ను క్రియేట్ చేసుకోవడం అన్ని చకచక జరిగిపోయాయి.

మరి లైలా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించే విధంగా లేదని తద్వారా సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందనే వార్తలు కూడా వెలబడుతున్నాయి.నిజానికి ఈ సినిమాని మొదటి నుంచి కూడా కొంతమంది కావాలనే తొక్కేస్తున్నారు అంటూ విశ్వక్ సేన్ తన అభిప్రాయాలను అయితే వెల్లడి చేశాడు.మరి మొత్తానికైతే ఈ సినిమాలో పెద్దగా మ్యాటర్ అయితే లేకపోవడం వల్లే సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియా వేదికగా మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా లేదనే వార్త చాలా బలంగా వినిపిస్తుంది…మరి ఈ సినిమా పోయినా కూడా తర్వాత సినిమాతో విశ్వక్ సేన్ మంచి విజయాన్ని అందుకుంటాడని తద్వారా ఆయనకు రావాల్సిన గుర్తింపైతే వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా వీళ్లు చేస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.కాబట్టి ఈ సినిమా కూడా అదే విధంగా సక్సెస్ ని సాధిస్తే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎక్కువగా జరిగేది.
కానీ సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయన్నైతే సాధించకపోవడం వల్ల అటు విశ్వక్ సేన్ కి ఇటు ఇండస్ట్రీకి కూడా ఇది భారీ మైనస్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి…
.