టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో అభినయ ప్రధాన పాత్రలను ఎంచుకునే హీరోయిన్ గా సాయిపల్లవికి( Sai Pallavi ) పేరుంది.సాయిపల్లవి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా ఈ మధ్య కాలంలో సాయిపల్లవి ఎక్కువగా ఏడుపుగొట్టు పాత్రలలో నటిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్, తండేల్ సినిమాలలో పాత్రలను ఉద్దేశించి నెటిజన్లు ఈ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయని అయినప్పటికీ సాయిపల్లవి నుంచి తాము అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాయిపల్లవి ఫిదా( Fidaa ) లాంటి రోల్స్ ను ఎంచుకోవచ్చుగా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్ట్స్ విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.

సాయిపల్లవి తండేల్ సినిమా( Thandel Movie ) సక్సెస్ తో ఎంతో ఆనందంగా ఉన్నారు.తండేల్ సినిమా సక్సెస్ సాధిస్తుందని ముందే ఊహించామని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.నాగచైతన్య,( Naga Chaitanya ) సాయిపల్లవి జోడీ సూపర్ హిట్ జోడీ అని తండేల్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సాయిపల్లవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.సాయిపల్లవి హెల్త్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు.రోజుకు 3 లీటర్ల కొబ్బరి నీళ్లను తాగుతానని ఆమె పేర్కొన్నారు.పెరుగు అంటే కూడా ఇష్టమని సాయిపల్లవి వెల్లడించారు.సాయిపల్లవి చెప్పిన స్కిన్ సీక్రెట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.
దాదాపుగా పదేళ్ల నుంచి వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.