అవును, మీరు విన్నది నిజమే.సాధారణంగా మనలో చాలామంది డబ్బుంటే ఏదైనా చేయొచ్చు.
ఎక్కడలేని రెస్పెక్ట్ వెతుక్కుంటూ వస్తుంది.అని అనుకుంటూ ఉంటారు.
కానీ అన్ని సందర్భాల్లో డబ్బు మనకు అన్ని ఇవ్వదు అనేదానికి ఓ చక్కటి ఉదాహరణే ఇది.ఆపిల్ సీఈఓ టిమ్ కుక్( Apple CEO Tim Cook ) గురించి ఎవరికి తెలియదు? అతను దాదాపుగా అందరికీ సుపరిచితుడే.ఆయన ప్రపంచంలో అపర కుబేరులలో ఒకరిగా వెలుగొందుతున్నాడు.ఆపిల్ కంపెనీ సీఈవోగా ఈయన ప్రపంచం మొత్తానికి తెలుసు.తన కంపెనీ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న టిమ్ కుక్ అంటే యువతికి చాలా క్రేజ్.అయితే ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన ఇతడిని అమెరికాలో( America ) మాత్రం ఎవరూ పట్టించుకోరా? మరి అలాంటి అనుమానాలకే దారి తీస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి.
అవును… మీరు విన్నది నిజమే.సాధారణంగా టిమ్ కుక్ కు అసాధారణ భద్రత ఉంటుంది.ఆయన ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీ వారి వెంట ఉండాల్సిందే.అయితే కుక్ ఇటీవల అమెరికాలోని న్యూ ఓర్లిన్స్ లో( New Orleans ) ఓ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ స్ట్రీట్ ఫుడ్ తిన్నారు.
ఈ క్రమంలో ఎవరైనా ఏం ఊహిస్తారు? సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి జనాలు పోటీ పడతారేమో అనే కదా! అయితే ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.పైగా అక్కడున్నవారు కుక్ ను గుర్తుపట్టక పోవడం కొసమెరుపు.
కుక్ స్ట్రీట్ ఫుడ్ తింటున్నంతసేపు ఎవరో బయట వ్యక్తి అని భావించారు.అంతేతప్ప ఆపిల్ కంపెనీ సీఈవో అని జనాలు అతనికోసం ఎగబడలేదు.
అదే చోద్యం అనుకుంటే… అదే సమయంలో అదే రెస్టారెంట్ కి అమెరికన్ ఫేమస్ ఫుట్ బాలర్ ఒడెల్( Footballer Odell ) అక్కడికి రాగా… అతడు రావడమే ఆలస్యం! జనం మొత్తం అతని చుట్టూ గుమిగూడి.సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్. ఇలా ఒక్కటేమిటి… మాట మాట కలిపి ఎంతోమంది సెల్ఫీలు దిగారు.కరచాలనం చేయడానికి అయితే తెగ పోటీపడ్డారు.ఇదంతా చూసి నవ్వుకుంటూ అక్కడ నుంచి కుక్ వెళ్లిపోయాడు.దీనిని కొంతమంది వీడియో తీశారు.
ఆ వీడియో అక్కడినుంచి మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దాంతో కుక్ ను అమెరికాలోనే జనం గుర్తించకపోవడాన్ని చాలామంది ఆశ్చర్యకరమైన విషయంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆపిల్ కంపెనీ సీఈవోగా.వేల కోట్లకు అధిపతిగా.
అంతే సంఖ్యలో ఉద్యోగులకు యజమానిగా ఉన్న కుక్ ను అమెరికన్లు గుర్తించకపోవడం నిజంగా షాక్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.