టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) గురించి మనందరికీ తెలిసిందే.మాస్ కమర్షియల్ సినిమాలను స్టైలిష్ గా తెరకెక్కిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్.
గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత ఆ స్థాయిలో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు అని చెప్పాలి.కానీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.
ఇకపోతే ఆయన చివరగా దర్శకత్వం వహించిన సినిమా మిస్టర్ బచ్చన్.( Mr Bachchan ) ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఈ నేపథ్యంలో బాలకృష్ణతో( Balakrishna ) సినిమా చేయాలని హరీష్ శంకర్ గత కొంత కాలంగా అనుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చివరికి కుదిరినట్టు తెలుస్తోంది.

హరీష్ శంకర్ బాలకృష్ణకు ఒక స్టోరీ లైన్ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందట.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందట.ప్రస్తుతం కన్నడ స్టార్ యశ్ హీరోగా టాక్సిక్ సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో బాలయ్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ప్రస్తుతానికి చర్చలు సాగుతున్నాయట.
త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.అయితే ఎప్పటినుంచో డైరెక్టర్ హరీష్ శంకర్ పై రీమేక్ డైరెక్టర్ అనే ముద్ర ఉన్న విషయం తెలిసిందే.
అయినా గత చిత్రాలు చాలా వరకు రీమేక్ లే అన్న విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు బాలయ్య బాబు కోసం ఒక ఒరిజినల్ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

మాస్ సినిమాల్లో తన స్టైల్ చూపించడంలో దిట్ట అయిన హరీష్, ఈ సినిమా ద్వారా రీమేక్ డైరెక్టర్ అనే ట్యాగ్ ను చెరిపేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ అగ్రగామిగా సాగుతోంది.ఆయన చేసిన ప్రతి సినిమా ఘన విజయం సాధిస్తోంది.ఈ క్రమంలో హరీష్ శంకర్ కి బాలయ్యతో సినిమా చేయడమే పెద్ద అవకాశంగా మారింది.ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే హరీష్ మళ్లీ టాప్ డైరెక్టర్ లిస్ట్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.