సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పలు ఆసక్తికరమైన అంశాలు వైరల్ గా మారడం పరిపాటిగా మారింది.మరీ ముఖ్యంగా సముద్రయానాలకు సంబంధించిన వీడియోలు జనాలు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు.
ఎందుకంటే సముద్ర ప్రయాణం అనేది మనసుకి ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో.అంతే స్థాయిలో భయాన్నీ కలిగిస్తుంది అనేది నేరుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేగానీ తెలియదు.
ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్( Viral Video ) అవుతుంటాయి.తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో జనాలు అవాక్కయి మరీ తిలకిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే… బోటుపై( Boat ) షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిపై తిమింగళం( Whale ) దాడి చేసినట్టు చాలా స్పష్టంగా గోచరిస్తోంది.చిలీలోని పటగోనియా సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.డేల్, ఆడ్రియన్ అనే తండ్రీకొడుకులు కలిసి చిన్న చిన్న బోట్లలో సముద్రంలోకి( Sea ) వెళ్లగా ఉన్నట్టుండి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం.ఆడ్రియన్ పడవను ఓ పెద్ద తిమింగళం అటాక్ చేయగా… ఒక్కసారిగా నీటి పైకి వచ్చి నోరు తెరచింది.
దీంతో ఆ వ్యక్తి చూస్తుండగానే పడవతో పాటూ అందులోకి వెళ్లిపోయాడు.కొడుకును తిమింగళం మింగేయడం చూసిన డేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
కట్ చేస్తే, అంతలోనే ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకోవడం కొసమెరుపు.విషయం ఏమిటంటే? తిమింగళం నోటిలో చిక్కుకున్న ఆడ్రియన్.కాసేపటికి బోటుతో అమాంతం నీటిపైకి రావడం అదృష్టం.దాంతో కొడుకును ప్రాణాలతో బయటికి రావడం చూసి తండ్రి డేల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.తరువాత ఈదుకుంటూ వెళ్లిన కొడుకు.తండ్రి పడవను పట్టుకున్నాడు.
కొడుక్కు ధైర్యం చెప్పిన తండ్రి.పడవను వేగంగా నడుపుతూ దూరంగా తీసుకెళ్లాడు.
దాంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘‘వామ్మో.
ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదే’’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ‘‘ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి!’’.అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.