కోజికోడ్ జిల్లాలోని( Kozhikode ) కోయిలాండిలో ఘోర అపశృతి చోటుచేసుకుంది.కురువంగాడ్‌లోని మణికులంగర ఆలయ( Manikulangara Temple ) ఉత్సవాలు హఠాత్తుగా విషాదకరంగా మారాయి.
ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి తీసుకురావబడిన ఏనుగులు( Elephants ) టపాసుల శబ్ధాలకు భయపడిపోవడంతో తొక్కిసలాట( Stampede ) జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
గురువారం రాత్రి ఉత్సవాలు జరుగు సమయంలో ఆలయ ఆవరణలో భక్తులు పెద్దఎత్తున బాణసంచా పేల్చారు.ఈ శబ్ధాలకు భయపడిన పీతాంబరన్, గోకుల్ అనే రెండు ఏనుగులు కోపముగా మారి భక్తులపైకి దూసుకొచ్చాయి.
భక్తులు ఆవరణలో నుండి బయటపడేందుకు పరిగెత్తడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో లీల (56), అమ్ముకుట్టి అమ్మ (70), రాజన్ అనే ముగ్గురు భక్తులు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు.వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు.గాయపడిన వారిని వెంటనే కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే పశువుల సంరక్షణ సిబ్బంది సకాలంలో స్పందించి, రెచ్చిపోయిన ఏనుగులను అదుపులోకి తెచ్చారు.కాగా, ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఈ ఘటనలో మొత్తంగా ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు ఉత్సవాలకు వచ్చిన భక్తులు పరుగులు పెట్టగా.చనిపోయిన ముగ్గురు వ్యక్తులు కాకుండా.అక్కడే ఉన్న మరో 30 మంది ప్రజలు గాయపడ్డారు.
ఇక ఇందులో కూడా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఘటనలో గాయపడిన ప్రజలని దగ్గరలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం ఏర్పాట్లు చేసారు.
మొత్తానికి రెచ్చిపోయిన ఏనుగులను పశువుల కాపరులు అదుపులోకి తెచ్చారు.