టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న హీరోయిన్లలో అనన్య నగళ్ల( Ananya Nagalla ) ఒకరు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనన్య నగళ్లకు తాజాగా ఒక చేదు అనుభవం ఎదురు కాగా ఆ అనుభవం గురించి అనన్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒక ఈవెంట్ కు వెళ్లాల్సిన అనన్య బ్యాగేజ్ ఆరు గంటలు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డారు.
మీరు ఇంత సింపుల్ గా సారీ చెబితే సరిపోతుందా అంటూ సంస్థ కస్టమర్ కేర్( Customer Care ) ప్రతినిధులతో మాట్లాడారు.
మీరు చేసిన ఆలస్యం వల్ల 2,000 మంది స్టూడెంట్స్ నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.ఒక ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి మధురై వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుందని అనన్య చెప్పుకొచ్చారు.
నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశానని అనన్య నగళ్ల చెప్పుకొచ్చారు.

కానీ వాటిలో ఒకటి ఆరు గంటలు ఆలస్యమైందని ఆమె కామెంట్లు చేశారు.కస్టమర్ కేర్ ను సంప్రదించిన సమయంలో వాళ్లు సింపుల్ గా క్షమాపణలు కోరారని అనన్య పేర్కొన్నారు.క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదని అనన్య నగళ్ల ఇండిగో విమానయాన సంస్థను( Indigo Airlines ) ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేశారు.
మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో అనన్య నగళ్ల భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

ఇండిగో సంస్థ అనన్య పోస్ట్ గురించి స్పందిస్తూ మీ లగేజ్ సరైన సమయానికి మిమ్మల్ని చేరుకోవడం ఎంత ముఖ్యమో మాకు అర్థమంది.మీరు కౌంటర్ ముగింపు సమయానికి చేరుకోవడం వల్ల తర్వాత విమానానికి మీ బ్యాగ్ కనెక్ట్ చేయబడిందని చెప్పుకొచ్చారు.హీరోయిన్ అనన్య నగళ్ల తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుని కెరీర్ పరంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.