టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్( Allu Aravind ) ఒకరు.గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అయితే తాజాగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో నాగచైతన్య( Nagachaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన తండేల్ సినిమా( Thandel ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారం రోజులలోనే బ్రేక్ ఈవెంట్ సాధించి 100 కోట్ల క్లబ్లో చేరింది.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.ఈ సినిమా శ్రీకాకుళానికి చెందిన ఒక జాలరి నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు అయితే శ్రీకాకుళంలో( Srikakulam ) కూడా సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని చిత్ర బృందం వెల్లడించారు అయితే తాజాగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొన్నారు.

ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవితో కలిసి అల్లు అరవింద్ వేదికపై డాన్స్ వేయడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వేదికపై అల్లు అరవింద్ సాయి పల్లవి ఇద్దరు కలిసి హైలెస్సా.హైలెస్సా అంటూ సాగే పాటకు డాన్స్ వేశారు.గతంలో కూడా అల్లు అరవింద్ తండేల్ మూవీ ఈవెంట్లలో సాయి పల్లవితో కలిసి స్టెప్పులేశారు.దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఈ సినిమా విజయానికి మరొక కారణంగా నిలిచిందని చెప్పాలి.