చైనాలో( China ) హైవే కార్మికులు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పెంపుడు కుక్కను( Pet Dog ) వాళ్లు తినేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ షాకింగ్ ఘటన షెన్‌జెన్‌లో( Shenzhen ) జరిగింది.అసలేం జరిగిందంటే, యి యి( Yi Yi Dog ) అనే ఓ పెంపుడు కుక్కను దాని యజమాని మాల్దీవులకు వెళ్తూ బోర్డింగ్ సెంటర్‌లో వదిలిపెట్టింది.
అయితే టపాసులు శబ్దాలకు భయపడి యి యి తప్పించుకుంది.రోడ్డుపైకి వచ్చిన యి యిని కారు ఢీకొట్టింది.
దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.
కుక్క చనిపోయిందని తెలియని యజమాని డాగ్ కోసం వెతకడం మొదలుపెట్టింది.ఏకంగా రూ.5 లక్షలు రివార్డు కూడా ప్రకటించింది.యి యి తన కుటుంబంలో “అత్యంత ముఖ్యమైన సభ్యుడు” అని ఆమె చెప్పడం అందరినీ కదిలించింది.రివార్డు ప్రకటించిన కొద్దిసేపటికే యజమానికి గుండెలు పిండేసే నిజం తెలిసింది.
తన కుక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, హైవే కార్మికులు( Highway Workers ) దాన్ని తిన్నారని తెలిసి ఆమె షాక్ అయింది.సీసీటీవీ ఫుటేజీలో కార్మికులు యి యి డెడ్ బాడీని కంపెనీ కిచెన్‌కు తీసుకెళ్లి వండి పంచుకుని తిన్నట్టు కనిపించింది.

దిగ్భ్రాంతికి గురైన యజమాని ఆన్‌లైన్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.“యి యి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది.నిన్ను నేను కాపాడుకోలేకపోయా.నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటా.” అని ఆమె రాసుకొచ్చింది.ఈ ఘటనపై సోషల్ మీడియాలో జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు.“వీధి కుక్క చనిపోయినా దాన్ని పూడ్చిపెడతారు.కానీ వాళ్లు దాన్ని ఎలా తింటారు?” అని ఒకరు కామెంట్ చేస్తే, “యజమాని మాటలు చదువుతుంటే కన్నీళ్లు ఆగట్లేదు” అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.

హైవే కంపెనీ, ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనను ధృవీకరించారు.కార్మికులు కుక్కను తిన్నారని కంపెనీ చెఫ్ కూడా ఒప్పుకున్నాడు.అయితే చనిపోయిన కుక్క వీధి కుక్క అనుకున్నామని, అందుకే తిన్నామని వాళ్లు చెప్పుకొచ్చారు.షెన్‌జెన్‌లో 2020 నుంచి కుక్కలు, పిల్లులను తినడం నిషేధం.చట్టం ఉల్లంఘించిన వారిపై ఫైన్ కూడా వేస్తారు.