వాలంటైన్స్ డే.. అది వారికి సంబంధించి కాదు.. ఉపాసన సరదా పోస్ట్ వైరల్!

ఈ రోజు ప్రేమికుల దినోత్సవం( Valentines Day ) సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కూడా ప్రత్యేకమైన పోస్టులు,విషెస్ లు కనిపిస్తున్నాయి.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.

 Upasana Shares Funny Post On Social Media Over Valentines Day Details, Upasana,-TeluguStop.com

ఇందులో బాగానే టాలీవుడ్ హీరో రామ్ చరణ్,( Ram Charan ) సతీమణి ఉపాసన( Upasana ) కూడా సరదాగా ఒక పోస్ట్ చేశారు.అందులోని సందేశంపై ఆమె నవ్వులు పూయించారు.

వాలంటైన్స్‌ డే అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించినది.

Telugu Game Changer, Ram Charan, Tollywood, Upasana, Upasanakamineni, Upasanan D

మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే( International Womens Day ) కోసం ఎదురు చూడండి అని ఆ పోస్ట్‌ లో రాసి ఉంది.ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా ఈ సరదా పోస్ట్‌ ను షేర్‌ చేసిన ఉపాసన స్మైలీ ఎమోజీలు జత చేశారు.దీనిపై నెటిజన్లు సైతం నవ్వులు పూయిస్తున్నారు.

ఈ పోస్టుపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.ఇకపోతే ఉపాసన విషయానికి వస్తే.

ప్రస్తుతం మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలను నిర్వహిస్తూనే ఉంది.అలాగే రామ్ చరణ్ కి సంబంధించి పనులను చూసుకుంటూ ఉంటుంది.

Telugu Game Changer, Ram Charan, Tollywood, Upasana, Upasanakamineni, Upasanan D

రామ్ చరణ్ విషయానికి వస్తే.రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ గా నిలిచింది.దాంతో తన తదుపరి సినిమాతో ఎలా అయినా మంచి సక్సెస్ అందుకోవాలని చుస్తున్నాడు చెర్రీ.

అయితే ప్రస్తుతం చెర్రీ నెక్స్ట్ సినిమాఫై చాలా అంచనాలు ఉన్నాయి.మరి చెర్రీ నెక్స్ట్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube