తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్.అతి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
విశ్వక్ సేన్ నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి.ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ లైలా మూవీతో( Laila Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
తాజాగా విడుదలైన ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం కాంట్రవర్సీలు నడుస్తున్నాయి.

అయితే విశ్వక్ సేన్ కు ఇదేం మొదటి సారి కాదు అని చెప్పాలి.ఎందుకంటే గతంలో చాలాసార్లు తన సినిమాల విడుదల సమయంలోనే లేనిపోని కాంట్రవర్సీలను( Controversies ) కొని తెచ్చుకున్నారు.కొన్నిసార్లు తన వ్యాఖ్యలు, చర్యలు వివాదాస్పదం అవుతుంటాయి.
అవి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంటాయి కూడా.ఐతే విశ్వక్ కావాలనే కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తాడనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి.
అశోక వనంలో అర్జున కళ్యాణం సహా కొన్ని చిత్రాల విడుదలకు ముందు రాజుకున్న వివాదాల వల్ల ఆయా చిత్రాలకు మంచి పబ్లిసిటీ వచ్చిందన్న అభిప్రాయం ఉంది.అయితే తాజాగా లైలా సినిమా రిలీజ్ ముంగిట ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ( Comedian Prudhvi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం, దీని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగడం, బాయ్‌కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం, దీనిపై టీం ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా తెలిసిందే.

మీ ప్రతి సినిమా ముంగిట ఈ వివాదాలేంటి, పబ్లిసిటీ కోసం ఇలాంటివి మీరే చేస్తున్నారా అని విశ్వక్‌ను అడిగగా.విశ్వక్ సేన్ మాట్లాడుతూ.కాంట్రవర్శీలను ఎవరూ కోరి తెచ్చుకోరు.నాకైతే ఇవి వద్దు అనే అనిపిస్తుంది.నా చివరి మూడు సినిమాల విషయంలో వివాదాలేమీ లేవు.లైలా ఈవెంట్లో వేరే నటుడు మాట్లాడిన మాటల మీద వివాదం చెలరేగింది.
నేను మూడు నెలలకో సినిమా చేస్తున్నాను.ఏదో ఒక సినిమా విషయంలో ఏదైనా జరిగినా సరే ప్రతిసారీ కాంట్రవర్శీ వస్తున్నట్లు అనిపిస్తుంది.
రోడ్డు మీద ఎక్కువ తిరిగితేనే కదా ప్రమాదాలు జరుగుతాయి.అలాగే నేను ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఇలా జరుగుతోందేమో.
సినిమా వేడుకల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలని నిబంధన వస్తే సంతోషమే.అది పెద్దవాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయం అని విశ్వక్ సేన్ తెలిపాడు.