టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్న హీరోయిన్లలో రష్మిక( Rashmika ) ఒకరు.బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న రష్మిక మరికొన్ని రోజుల్లో ఛావా సినిమాతో( Chhaava Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ ప్రతి దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తే లైఫ్ చాలా కష్టతరం అవుతుందని పేర్కొన్నారు.
అందుకే నేను ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోనని రష్మిక వెల్లడించారు.
నేను కాలంతో పాటు ముందుకు సాగుతానని నిజాయితీగా నా పని చేసుకుంటూ పోతానని ఆమె చెప్పుకొచ్చారు.ఎవరైనా సినిమా కోసం సంప్రదించిన సమయంలో కథకు ప్రాధాన్యమిస్తానని రష్మిక పేర్కొన్నారు.
కథ బాగుంటే నలుగురు ఐదుగురు పిల్లల తల్లిగానైనా నటిస్తానని రష్మిక వెల్లడించడం గమనార్హం.

కథ నచ్చితే బామ్మ రోల్( Grandmother Role ) చేయడానికి కూడా వెనుకాడనని ఆమె పేర్కొన్నారు.కథ నచ్చితే నాకు ఎలాంటి పట్టింపులు ఉండవని ఆమె తెలిపారు.నా సినిమాల సక్సెస్ వెనుక ఎలాంటి ప్రణాళికలు లేవని రష్మిక పేర్కొన్నారు.
నా లక్ కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతున్నాయని ఆమె వెల్లడించారు.అలాంటి గొప్ప కథల్లొ భాగం కావడం నా లక్ అని రష్మిక చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులు ఆ పాత్రల్లో నన్ను ఇష్టపడుతున్నందుకు ఆనందంగా ఉందని రష్మిక కామెంట్లు చేశారు.సినిమాల సక్సెస్ అనేది మా చేతిలో ఉందని రష్మిక వెల్లడించారు.ఛావా సినిమాలో యేసుబాయిగా నటించే ఛాన్స్ వచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నానని రష్మిక పేర్కొన్నారు.మహారాణి పాత్రలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.రష్మిక రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.రష్మిక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.