హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) తన గత సినిమా మెకానిక్ రాకీ ప్రేక్షకులను నిరాశకు గురి చేసిందని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు.మెకానిక్ రాకీ సెకండాఫ్ బాగానే ఉన్నా ఫస్టాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.
అయితే విశ్వక్ సేన్ లైలా సినిమాకు( Laila Movie ) దారుణంగా రివ్యూలు వస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
సినిమాలో కథ, కథనం ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు అసభ్యకర సంభాషణలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లైలా సినిమాకు బుకింగ్స్ కూడా ఆసక్తికరంగా లేకపోవడం గమనార్హం.విశ్వక్ సేన్ పడిన కష్టానికి తగిన ఫలితం అయితే దక్కలేదనే చెప్పవచ్చు.
విశ్వక్ సేన్ తన తర్వాత సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడలేమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విశ్వక్ సేన్ కథలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.సాహో గారపాటి నిర్మాణ విలువలు బాగానే ఉన్నా ఈ నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
థియేటర్లలో ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ లేదు.

తండేల్ మూవీకి( Thandel Movie ) మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని చెప్పవచ్చు.పొలిటికల్ వివాదాలు లైలా మూవీకి ఒక విధంగా నష్టం కాగా కథ, కథనం మైనస్ కావడం ఈ సినిమాకు శాపమైంది.హిట్ టాక్ వచ్చి ఉంటే లైలా మూవీ పరిస్థితి మరో విధంగా ఉండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లైలా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.విశ్వక్ సేన్ కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.