అవును, మీరు విన్నది నిజమే.వినడానికి అసహ్యంగా ఉన్నా, మీరు విన్నది అయితే అక్షర సత్యం.
అక్కడ వారు చేసింది అయితే చాలా దారుణాతిదారుణం.విషయంలోకి వెళితే… మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని( Jabalpur ) నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలో( Netaji Subhash Chandra Bose Medical College ) జరిగిన ఈ సంఘటన… పైగా మెడికల్ కాలేజీకి సంబందించిన వ్యవహారం కావడంతో జనాలు సోషల్ మీడియాలో సదరు కాలేజీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
గత వారం జరిగిన జాతీయ వైద్య సదస్సులో వంట కోసం టాయిలెట్ ట్యాప్( Toilet Tap ) నుండి వచ్చిన నీటిని ఉపయోగిస్తున్నట్లు నిరూపణ కావడంతో సర్వత్రా తీవ్ర దుమారం చెలరేగింది.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు మరియు వైద్య నిపుణులు హాజరైన సదరు జాతీయ స్థాయి వైద్య సమావేశం( National Medical Conference ) (ఫిబ్రవరి 6)లో పాల్గొనేవారికి విందు ఏర్పాటు చేయగా… కుళాయి నుండి వస్తున్న నీటిని నింపి వంట కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది.దాంతో వైద్య కళాశాల మేనేజ్మెంట్ విభాగం వంటవారిని వివరణ కోరింది.ఈ నేపథ్యంలో కళాశాల డీన్ నవనీత్ సక్సేనా మాట్లాడుతూ, సదరు నీటిని మురికి పాత్రలను శుభ్రం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నామని, వంట చేయడానికి కాదని వివరణ ఇచ్చారు.
కానీ వీడియో యొక్క సందర్భాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు.

ఈ క్రమంలో ఆరోగ్య శాఖ దర్యాప్తుకు పిలుపు ఇవ్వగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, “ఈ సమావేశం న్యూ అకాడెమిక్ బ్లాక్‌లో నిర్వహించబడింది.ఇలాంటి బహిరంగ సమావేశాలు జరిగినపుడు వెనుక ఉన్న బహిరంగ ప్రదేశాలలో ఆహారాన్ని వండడం జరుగుతుంది.వీడియోలో టాయిలెట్ ట్యాప్ నుండి నీటిని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మాకు లభించిన సమాచారం ప్రకారం అది పాత్రలు కడగడానికి మాత్రమే వాడబడినట్టు తెలుస్తోంది.
అయితే, ఇది మా దృష్టికి తీసుకురాబడినందున, అధికారిక దర్యాప్తు కోసం నేను డీన్‌కు లేఖ రాశాను!” అని తెలియజేసారు.దాంతో ఈ తంతు సద్దుమణిగినట్టు తెలుస్తోంది.