ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి గడువు దగ్గర పడింది.మరో ఐదు రోజులలో ఈ మహా సంగ్రామం ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.ఒకవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా, మరోవైపు అభిమానులను మరింత ఉత్సాహపరిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభం కానుంది.
ఆ తర్వాత ఐపీఎల్ 18వ సీజన్( IPL 18 ) తొలి మ్యాచ్ మార్చ్ 22న, శనివారం రోజున ప్రారంభమవుతుందని సమాచారం.తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( KKR vs RCB ) మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది.
ఇకపోతే, క్రీడాభిమానుల కోసం గత రెండు సీజన్లలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేసిన జియో హాట్ స్టార్( Jio Hotstar ) ఇప్పుడు తన వ్యూహంలో కీలక మార్పులు చేసింది.ఐపీఎల్ 2025 మరియు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ( ICC Champions Trophy ) మ్యాచ్‌లను ఉచిత ప్రసారాన్ని నిలిపివేస్తూ, ఇప్పుడు ఈ మ్యాచ్‌లు చూడాలంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందే అని తేల్చేసారు.
ఈ సేవలను అందించడానికి వయాకామ్ 18, స్టార్ ఇండియా సంస్థల విలీనంతో జియో హాట్ స్టార్ కొత్తగా ప్రారంభమైంది.గతంలో జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేరుగా ఉండేవి.తాజాగా ఈ రెండు విలీనమై, జియో హాట్ స్టార్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయకుండా నిర్ణయం తీసుకుంది.ఇక సబ్స్క్రిప్షన్ ప్లాన్ వివరాల విషయానికి వస్తే.
జియో హాట్ స్టార్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, మొదటి కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉచితంగా మ్యాచ్ ప్రసారం జరుగుతుంది.ఆ తర్వాత మ్యాచ్‌ను చూసేందుకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి.
రూ.149 – మూడు నెలల బేసిక్ ప్లాన్ (మొబైల్‌లో మాత్రమే), రూ.499 – ఏడాది ప్లాన్ (మొబైల్), రూ.299 – మూడు నెలల ప్లాన్ (రెండు డివైజ్‌లకు), రూ.899 – ఏడాది ప్లాన్ (రెండు డివైజ్‌లకు) వాసులు చేయనున్నారు.2022లో రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 సుమారు రూ.23,758 కోట్లకు ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులు దక్కించుకుంది.2023 నుంచి 2027 వరకు ఈ హక్కులు వీరే వినియోగించుకోనున్నారు.
ఇప్పటి వరకు రెండు సీజన్లలో ఉచిత ప్రసారాన్ని అందించిన జియో హాట్ స్టార్, ఇప్పుడు సడన్‌గా సబ్‌స్క్రిప్షన్ విధించడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇక ఐపీఎల్‌ను చూడాలంటే డబ్బులు చెల్లించాల్సి రావడం నిరాశ కలిగించింది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
అయితే, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత బెటర్ క్వాలిటీ సర్వీస్ అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత సంస్థలు పేర్కొంటున్నాయి.ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025 సీజన్ మొదటి మ్యాచ్ కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుండడంతో ప్రేక్షకులు ఈ రెండు ప్రధాన టోర్నీలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.