అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipala )ఏం చెప్పినా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్1 మూవీ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో శోభిత ధూళిపాళ్ల ఆ రోజులను గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
శోభిత టీమ్ తో కలిసి దిగిన ఫోటోను పంచుకోవడంతో పాటు “వీళ్లందరూ ఎవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను” అని క్యాప్షన్ పెట్టారు.
పొన్నియిన్ సెల్వన్ మూవీ( Ponniyin Selvan ) యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.శోభిత పిల్లల గురించి అప్పుడే ఆలోచిస్తూ ఉండటం అక్కినేని అభిమానులకు ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది.త్వరలో చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.2025 ఫస్టాఫ్ లో చైతన్య శోభిత పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి.నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు.
తండేల్ సినిమా చైతన్య సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ కాగా అదే సమయంలో బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా భారీ సినిమా అనే సంగతి తెలిసిందే. తండేల్ సినిమా( Thandel )లో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం నాగచైతన్య కెరీర్ కు ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే.చైతన్య పారితోషికం పరిమితంగానే ఉండగా తర్వాత సినిమాలతో చైతన్య సరికొత్త రికార్డులను ఖాతాలో వేసుకోవాలని అభిమానులు సైతం ఫీలవుతున్నారు.
చైతన్య శోభిత జోడీ చూడముచ్చటగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.శోభితను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.