యంగ్ టైగర్ జూనియర్ అన్న కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గతంలో జై లవకుశ సినిమాతో కళ్యాణ్ రామ్ ను నిర్మాతగా నిలబెట్టిన ఎన్టీఆర్ దేవర సినిమాతో కళ్యాణ్ రామ్ ను పూర్తిస్థాయిలో నిర్మాతగా నిలబెట్టారనే చెప్పాలి.
దేవర సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభాలను అందించిన సంగతి తెలిసిందే.రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాకు భారీ లాభాలు ఖాయమని తెలుస్తోంది.
అన్న కళ్యాణ్ రామ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ లాభాలను అందిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర సినిమా( Devara movie ) మిక్స్డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటుండగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ( jr ntr , Prashanth Neel )కాంబో మూవీలో సైతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం దేవర మూవీ సక్సెస్ తో భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఆయన సక్సెస్ రేట్ ను పెంచుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.