భారతదేశంలోని యూఎస్ మిషన్ కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్‌లను విడుదల చేయడాన్ని ఆసియా అమెరికన్‌లపై ప్రెసిడెన్షియల్ కమీషన్‌లోని సభ్యుడు , కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు.పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్ధులు సహా ప్రయాణికుల కోసం అదనపు స్లాట్‌లను తెరిచినట్లు భారత్‌లోని యూఎస్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.వీటి వల్ల భారతీయ వీసా దరఖాస్తుదారులు వారి వీలును బట్టి ఇంటర్వ్యూలు తీసుకోవచ్చన్నారు.
ఈ పరిణామంపై భూటోరియా( Ajay Jain Bhutoria ) స్పందిస్తూ.ఇది గతంలో తాను సమర్పించిన సిఫారసులలో ఒకటన్నారు.వీసా అపాయింట్‌మెంట్‌లో నిరీక్షణ సమయాలను పరిష్కరించడంలో కృషి చేసిన భారత్‌లోని యూఎస్ ఎంబసీకి, ప్రత్యేకించి భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ప్రెసిడెన్షియల్ కమీషన్‌లో సభ్యుడిగా వీసా అపాయింట్‌మెంట్ టైమ్‌లు తగ్గించడంతో పాటు గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌ల తగ్గింపు లక్ష్యంగా భూటోరియా గతంలో పలు సిఫార్సులు చేశారు.
వీసా అపాయింట్‌మెంట్( Visa appointment )ల సంఖ్యను పెంచడంతో పాటు వీడియో అపాయింట్‌మెంట్‌ల వంటి వినూత్న పరిష్కారాలను అన్వేషించడం వీటిలో ఉన్నాయి.
2024లో ఇప్పటి వరకు 12 లక్షల మంది భారతీయులు అమెరికా( America )లో అడుగుపెట్టినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.2023తో పోలిస్తే ఇది 35 శాతం పెరుగుదలగా నిపుణులు చెబుతున్నారు.ఇరుదేశాల మధ్య వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి ప్రధాని నరేంద్ర మోడీ, జో బైడెన్‌లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు.ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో ఉన్న కాన్సులర్ బృందాలు, నాలుగు కాన్సులేట్లు నిర్విరామంగా పనిచేస్తాయని చెప్పారు.2023లో అమెరికా.భారతీయులకు 1.4 లక్షలకు పైగా విద్యార్ధి వీసాలను జారీ చేసిందని అంచనా.ఇతర దేశాలతో పోలిస్తే ఇది బాగా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.