యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ సోమవారం రోజు కూడా కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది.ఫస్ట్ వీకెండ్ తో పోల్చి చూస్తే కలెక్షన్లు తగ్గినా నాలుగో రోజు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చాయి.నాలుగో రోజు నైజాంలో 2.34 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన దేవర సీడెడ్ లో కోటీ 28 లక్షల రూపాయలు సాధించడం గమనార్హం.
వైజాగ్ లో 52 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న దేవర( Devara ) ఉభయ గోదావరి జిల్లాల్లో 44 లక్షల రూపాయలు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో 59 లక్షలు, నెల్లూరులో 23 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.బుధవారం రోజున గాంధీ జయంతి కావడంతో ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.సెకండ్ వీకెండ్, దసరా సెలవులను సైతం ఈ సినిమా క్యాష్ చేసుకోనుంది.
ఈ వారం థియేటర్లలో శ్రీవిష్ణు శ్వాగ్ మూవీ( Swag T ) విడుదలవుతూ ఉండగా ఈ సినిమాకు థియేటర్లు ఎక్కువ సంఖ్యలోనే కేటాయించినా దేవర సినిమాకు ఇబ్బంది ఉండదు.ఫుల్ రన్ లో దేవర మూవీ 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శ్రీవిష్ణు సినిమా దేవరకు ఏ మాత్రం పోటీ కాదని చెప్పవచ్చు.
దేవర సినిమా ఇతర భాషల్లో సైతం కలెక్షన్ల పరంగా అదరగొడుతోందనే చెప్పాలి.అన్ని ఏరియాలలో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర1 హిట్ గా నిలిచిన నేపథ్యంలో దేవర మూవీ సీక్వెల్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ దేవర సినిమా తారక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.