జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

సోషల్ మీడియాలో ఎన్నో ట్రాజడీ స్టోరీలు, ( Tragedy Stories ) వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఇండియాలో ఒకప్పుడు బాగా బతికిన లేదా బాగా చదువుకొని ఉద్యోగాలు చేసిన కొంతమంది చివరికి రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ కనిపిస్తుంటారు.

 Viral Video Engineer Turned Garbage Collector Video Goes Viral Details, Homeless-TeluguStop.com

వారి తమ స్టొరీ అని చెప్పి అందర్నీ కదిలిస్తుంటారు.కొందరు వారికి సహాయం చేస్తా ఉంటారు అలాగే వారి జీవితాన్ని బాగుచేయాలనే ఉద్దేశంతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతారు.

అవి చూసి వీరికి నెటిజన్లు తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తుంటారు.తాజాగా అలాంటి ఒక అన్‌లక్కీ పర్సన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ తన గురించి చెప్పుకుంటున్నాడు.ఆయన ఇంతకు ముందు దుబాయ్‌లో ఇంజనీర్‌గా( Dubai Engineer ) పని చేసేవాడట.కానీ ఇప్పుడు ఆయన రోడ్డున పడ్డాడు తినడానికి తిండి కూడా దొరకక ఆకలితో అలమటిస్తున్నారు.రోజూ చెత్తను సేకరిస్తూ,( Garbage Collector ) తినడానికి, కాస్త డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నాడు.

ఈ వీడియోను ‘జిగర్ రావల్’( Jigar Rawal ) అనే వ్యక్తి తీశాడు.ఆయన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా.జిగర్ రావల్ ఆ మనిషి పరిస్థితి ఎంత బాధాకరంగా మారిందో తెలియజేయడానికి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో సదరు మనిషి “నేను ఒక ఇంజనీర్‌ని. నీ దగ్గర తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వగలవా? నాకు ఇప్పుడు పని దొరకట్లేదు.కానీ నేను ఇంజనీర్‌ని, గతంలో డూబాయ్‌లో బాగా సంపాదించేవాడిని,” అని ఆయన చెప్పారు.

భార్య తనని వదిలి వెళ్లిపోయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆయన చెప్పారు.ఆయన కళ్లు కన్నీటితో బాగా తడిసిపోయాయి కూడా.తన కుటుంబానికి ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి పనిచేశానని, కానీ చివరికి తన భార్య తనని వదిలి వెళ్లిపోయిందని తెలుసుకొని ఎంతో బాధపడ్డానని చెప్పారు.

“నా భార్య మన పిల్లలతో కలిసి వేరొకరితో వెళ్లిపోయింది.నేను విదేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తే ఆమెకు కూడా ఏదైనా ఇస్తాను అనుకున్నాను కానీ అలా జరగలేదు.నేను ఇలాంటి పరిస్థితిలో పడ్డాను” అని ఆయన బాధపడుతూ చెప్పారు.

ఇప్పుడు ఆయన వీధుల్లో తిరుగుతూ చెత్తను సేకరిస్తూ, దాన్ని చిరు వ్యాపారులకు అమ్మి కొద్ది డబ్బు సంపాదిస్తున్నారు.తన జీవితం పూర్తిగా మారిపోయిందని, కుటుంబం కూడా కోల్పోయి, చాలా కష్టాలు పడుతున్నానని ఆయన చెప్పారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఇప్పటికే దీన్ని 19 మిలియన్ మందికి పైగా చూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube