కాన్పూర్ వేదికగా జరిగిన టీమిండియా( Team India ) బంగ్లాదేశ్ రెండవ టెస్ట్ మ్యాచ్ లో( Second Test Match ) బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్లింగ్ లతో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.దీంతో 2 -0 తో టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.
మొదటి రోజు నుండి మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడుతూనే వస్తున్నాడు.మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే సాధ్యపడిన ఆట ఆ తర్వాత రెండవ రోజు మూడో రోజు పూర్తిగా ఒక్క బాలు పడకుండానే రద్దయింది.
దాంతో కేవలం నాలుగవ రోజు ఐదో రోజు ఆట జరిగి టీమిండియా టెస్ట్ ను గెలుచుకుంది.
ఇందులో భాగంగా 4వ రోజు బంగ్లాదేశ్( Bangladesh ) తన మొదటి ఇన్నింగ్స్ లో 203 ఆల్ అవుట్ అయింది.బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియా ఒకరి తర్వాత ఒకరు బంగ్లాదేశ్ బౌలర్లకు పట్ట పగలు చుక్కలు చూపించారు.టి20 ఇన్నింగ్స్ ఆడి ధనాధన్ బ్యాటింగ్ తో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇక నాల్గవ రోజు సాయంత్రం సెక్షన్ లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ అదే రోజు రెండు వికెట్లు కోల్పోగా.
ఐదో రోజు బోలర్ల దెబ్బకి రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 146 పరుగులకే పరిమితమైంది.దీంతో టీమ్ ఇండియాకు 98 పరుగుల స్వల్ప లక్ష్యం ముందు ఉంచింది.స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకొని టెస్ట్ సిరీస్ ను 2 – 0 తో క్లీన్ స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నెలకొల్పారు.