ప్రస్తుత రోజుల్లో కార్యక్రమం ఏదైనా సరే కచ్చితంగా డీజే( DJ ) ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.పుట్టినరోజు వేడుకైనా సరే, దావత్ అయినా సరే, పెళ్లి కార్యక్రమం ఇలా ఈ కార్యక్రమమైనా సరే డీజే తప్పనిసరిగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా నేటి నుంచి హైదరాబాద్ మహానగరంలో( Hyderabad ) డీజే నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ నగర సిపి ఆనంద్( CP Anand ) ఉత్తర్వులను చారి చేశారు.అయితే ఇందుకు కారణం లేకపోలేదు.
హైదరాబాద్ మహానగరంలో డైలీ 100కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో నగరంలోని రాజకీయ పార్టీల పెద్దలు, అలాగే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలతో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం పోలీస్ అధికారులు తీసుకున్నారు.దీంతో డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్మెంట్ పరకాల పై నిషేధం విధించారు.ఈ ఉత్తర్వుల నేపథ్యంలో భాగంగా రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 6 గంటల వరకు ఎటువంటి బాణాసంచా( Fire Crackers ) కానీ.డీజేలు వాడకూడదని సూచించారు.
అవసరమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రం తక్కువ శబ్దంతో ఉండే విధంగా అనుమతులు ఇచ్చారు.ముఖ్యంగా పాఠశాల, ఆసుపత్రులు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో ఈ నిషేధ చర్యలు జారీ కానున్నాయి.
ఇకపోతే మతపరమైన ర్యాలీలో ఇలాంటి డీజే వాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సౌండ్ సిస్టం పెట్టాలంటే కచ్చితంగా పోలీస్ క్లియరెన్స్ ఉండాలంటూ స్పష్టం చేశారు.హైదరాబాద్ మహానగరంలో నాలుగు జోన్లలో సౌండ్ సిస్టం లో( Sound System ) పెట్టడానికి ఉదయం సమయంలో 55 డేసిబల్స్ మించి ఉండకూడదు.అలాగే రాత్రి సమయంలో 45 డేసిబల్స్ గురించి సౌండ్ సిస్టం ఉంచకూడదు.
అంతేకాదు ఏ మతపరమైన ర్యాలీ సంబంధించిన బాణసంచా కాల్చకూడదు.ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అందుకు కారుకులైన వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఒకవేళ అదే పనిగా నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రతినిత్యం 5000 రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.