మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పది రోజులు మద్యం లేకుండా ఉండాల్సిందేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని( Andhra Pradesh ) మందుబాబులకు బ్యాడ్ న్యూస్.అదేంటంటే.

 Bad News For Drug Addicts Have To Stay Without Alcohol For Ten Days Details, Bad-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మద్యం దుకాణాలు( Bar Shops ) మూతబడ్డాయి.దీనికి కారణం సెప్టెంబర్ 30 నాటికి వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తి కావడమే.

అయినా కానీ మరో 10 రోజులపాటు వైన్ షాపులు తెరవాలని ఏపీ ప్రభుత్వం వారిని కోరింది.అయితే పది రోజుల తర్వాత ఎటు తమ ఉద్యోగాలు ఉండవన్న ఉద్దేశంతో.

నేటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు( Contract Employees ) విధుల్లోకి రాలేదు.ఎలాగో ప్రవేట్ వైన్స్ షాప్ వస్తాయన్న నేపథ్యంలో నేటి నుంచి వైన్ షాప్ కాంట్రాక్టు ఉద్యోగులు విధుల్లోకి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 3240 వైన్ షాపులు తెరుచుకోలేదు.

దీంతో చాలామంది మందుబాబులు మందు కావాలంటే బార్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu Alcohol, Ap, Ap Wine Shops, Bad, Bar Shops, Drug Addicts, Latest-Latest N

నిజానికి వైన్ షాపులలోని మద్యానికి, బార్లలో ఉండే మద్యం ధరలలో చాలా తేడా ఉంటుంది.కాబట్టి కొత్త మద్యం దుకాణాలు వచ్చేంతవరకు మందుబాబులకి ఇబ్బందులు తప్పవు.అక్టోబర్ 12 నుండి కొత్త మధ్య పాలసీ ప్రకారం మద్యం మరింత ప్రియం కాబోతున్నట్లు సమాచారం.

తాజాగా ఏపీ నూతన మద్యం పాలసీ( AP Liquor Policy ) నోటిఫికేషన్ ను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఇందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెబుతూ కొత్త పాలసీని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది.

Telugu Alcohol, Ap, Ap Wine Shops, Bad, Bar Shops, Drug Addicts, Latest-Latest N

ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడి అక్టోబర్ 12వ తేదీ నుండి ప్రవేటు మద్యం షాపులు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు.కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ రావడంతో అక్టోబర్ 1 (మంగళవారం) నుండి అక్టోబర్ 9 వరకు దరఖాస్తులు తీసుకొని ఉన్నారు.ఆ తర్వాత 11వ తేదీన 3396 దుకాణాలకు లాటరీ తీయనున్నారు అధికారులు.ఈ దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తుకు రెండు లక్షల రూపాయల రుసుమును నిర్ణయించారు ఎక్సైజ్ శాఖ.అలాగే లైసెన్స్ ఫీజుల కింద 5 నుండి 85 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు.

దీంతో నేడు ఉదయం పలు జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు షాపులను గుర్తించి గెజిట్ లను జారీ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జరిగింది.

ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులను అప్లై చేసుకునే విధంగా వెసులుబాటును కల్పించారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube