అలనాటి ప్రముఖ హాస్య చిత్రాల నరసింహారావు గారి గురించి నేటితరానికి తెలియకపోవచ్చు.కానీ నిన్న, మొన్నటి తరానికి ఆయన గురించి బాగా తెలుసు.
సినిమా దర్శకులు ఎంతమది ఉన్నా, రేలంగా వారు చాలా ప్రత్యేకమైన వారు.ఆయన తీసిన కామెడీ సినిమాలు చూసి అప్పట్లో ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకొనేవారు.
అయితే ఆయన సినీ కెరీర్ లో ఒక్క సినిమాతో అరుదైన రికార్డు తృటిలో చేజారిందనే విషయం చాలా మందికి తెలియదు.అవును, దర్శకుడిగా రేలంగి నరసింహారావు గారు( Relangi Narasimha Rao ) ఒకే ఒక్క సినిమాతో గిన్నీస్ బుక్ రికార్డు( Guinness Book Record ) మిస్ చేసుకున్నారు.
ఆయన తీసిన కామెడీ చిత్రాలను( Comedy Movies ) అంత త్వరగా మర్చిపోవడం కష్టం.అందలోను ముఖ్యంగా… “ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, బ్రహ్మచారి మొగుడు, కన్నయ్య కిట్టయ్య, పరుగో పరుగు” వంటి హాస్య చిత్రాలను మనం మర్చిపోలేము.అప్పటి సినిమా జనాలను ఎంతగానో అలరించిన ఈ సినిమాలకు దర్శకుడు రేలంగి నరసింహారావు అని మీకు తెలుసా? టైటిల్ తోనే సంచలనం క్రియేట్ చేయడం వారికే చెల్లింది.
ఇక విషయంలోకి వెళితే… 1989 లో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏకంగా 11 రిలీజ్ అయ్యాయి.అప్పటికే ఏడాదికి 11 సినిమాలతో ఓ మలయాళ దర్శకుడు పేరిట గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు అయింది.కాగా 1989లో 11 సినిమాలు అప్పటికే విడుదలై, 12 వ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన రేలంగి నరసింహారావు.
అప్పటికే ఆయన దర్శకత్వంలో, కృష్ణంరాజు గారు నటించిన యమధర్మరాజు సినిమా( Yamadharmaraju Movie ) షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.అదే విధంగా నిర్మాణం పూర్తిచేసుకుని విడుదలకు కూడా సిద్ధంగా ఉంది.
ఆ ఒక్క సినిమా విడుదలైతే ఆ యేడాది ఆయనది 12 వ సినిమా అవుతుంది.కానీ కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావడం వల్ల ఆ సినిమా ఆ మరుసటేడు 1990 లో విడుదలైంది.
అలా ఒకే ఒక్క సినిమాతో గిన్నీస్ బుక్ రికార్డు మిస్సయ్యింది.అయితే గిన్నీస్ రికార్డు మిస్సయినా జనాల గుండెల్లో ఎప్పటికీ రేలంగి వారి స్థానం పదిలం అని చెప్పుకోకతప్పదు.