తలనొప్పి నుంచి జ‌లుబు వ‌ర‌కు అనేక స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధం ఇంగువ.. ఎలా వాడాలంటే?

ఉరుకుల పరుగుల జీవితంలో తరచూ పలకరించే సమస్యల్లో తలనొప్పి ఒకటి.తలనొప్పి చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుంది.

 Amazing Benefits Of Hing! Hing, Hing Benefits, Latest News, Health, Health Tips,-TeluguStop.com

ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.తలనొప్పిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం మంది పెయిన్ కిల్లర్ వేసుకుంటారు.

కానీ పదేపదే పెయిన్ కిల్లర్స్ ను వాడటం వల్ల దీర్ఘకాలికంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.అందుకే సహజంగా తలనొప్పి( Headache )ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే ఇంగువ తలనొప్పిని దూరం చేయడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

Telugu Asafoetida, Cough, Headache, Tips, Benefits, Latest-Telugu Health

వంటల్లో వాడే ఒక సుగంధ ద్రవ్యం ఇంగువ.ఆహారంలో రుచిని పెంచడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఎన్నో పోషకాలు మరెన్నో ఔషధ గుణాలను కలిగి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఇంగువ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా తలనొప్పి ని తరిమి కొట్టడానికి ఇంగువ హెల్ప్ చేస్తుంది.అందుకోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ తీసుకుని అందులో చిటికెడు ఇంగువ వేసి కరిగించి సేవించాలి.

ఈ విధంగా కనుక చేస్తే తలనొప్పి నుంచి క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.సాధారణ తలనొప్పి మాత్రమే కాదు మైగ్రేన్ తలనొప్పి ఉన్న కూడా దూరం అవుతుంది.

Telugu Asafoetida, Cough, Headache, Tips, Benefits, Latest-Telugu Health

అలాగే జలుబు, దగ్గు( Cold, cough ) వంటి సమస్యలను నివారించడానికి కూడా ఇంగువ స‌హాపడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో అర టీ స్పూన్ ఇంగువ పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రెండు సార్లు చొప్పున ఉదయం సాయంత్రం తీసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే చాలా వేగంగా జలుబు మరియు దగ్గు సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఇంగువ యొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శ్వాసకోశాన్ని క్లియ‌ర్ చేస్తాయి.అంతేకాదు ఆడవారికి ఇంగువ ఒక వరం అని చెప్పుకోవచ్చు.

నెలసరి సమయంలో వాటర్ లో చిక్కుడు ఇంగువ పొడి కలిపి తీసుకోవడం వల్ల నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.ఇక‌ రెగ్యులర్ డైట్ లో ఇంగువ ఉంటే గ్యాస్‌, అసిడిటీ, మలబ‌ద్ధ‌కం వంటి జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఇంగువ యొక్క యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు ప్రేగులలో వృక్షజాలం పెరుగుదలను నిరోధిస్తాయి మరియు కడుపు ఇన్ఫెక్షన్ సంభావ్యతను సైతం తగ్గిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube