సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం( Nuthankal mandal ) మాచనపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని గుగులోతుతండాలో సోమవారం కురిసిన వర్షానికి పిడుగుపడి గుగులోతు రాములు అనే గిరిజన రైతుకు చెందిన రెండు ఎద్దులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధిత రైతు( Farmer ) తమ వ్యవసాయ అవసరాల కోసం రెండు ఎద్దులను పెంచుకున్నాడు.
రోజు మాదిరిగానే సోమవారం సాయంత్రం పశువుల కొట్టంలో ఎద్దులను కట్టేసి ఇంటికి వచ్చాడు.మంగళవారం ఉదయం భావి దగ్గరకు వెళ్లి చూసేసరికి ఎద్దులు మృతి చెంది ఉన్నాయని,సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని కన్నీరు మున్నీరుగా విలపించాడు.
ప్రకృతి వైపరీత్యం వల్లన తన కుటుంబం నష్టపోయిందని, ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.