సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు పోవాలి:సూర్వి యాదయ్య గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వం సర్పంచ్( Sarpanch ) ల పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ అన్నారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వడ్డీలకు డబ్బులు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేశామని,కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా సర్పంచ్ ల బిల్లులపై కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

 Sarpanchs Should Go To The Polls Only After Paying Their Pending Bills: Survi Ya-TeluguStop.com

వచ్చే నెల ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పగానే మాజీ సర్పంచులు ఆవేదనకు గురవుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేనియెడల ఆగస్టు 2 తారీఖున సెక్రటేరియేట్ ముందు నిరసన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచ్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube