ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను అందరితో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో తెలిసిపోతుంది.
ఈ క్రమంలోనే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను ట్రోల్ చేస్తూ ఉన్నారు.ఇలా ట్రోల్స్ కారణంగా పలువురు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు అసభ్యకరమైన వీడియోలను విడుదల చేస్తున్న యూట్యూబ్ ఛానల్ ను బ్యాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
![Telugu Divorce, Rajeev Kanakala, Rajeevkanakala, Suma, Trollers-Movie Telugu Divorce, Rajeev Kanakala, Rajeevkanakala, Suma, Trollers-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Rajeev-Kanakala-fires-on-social-media-trollersb.jpg)
ఈ క్రమంలోనే సినీ నటుడు రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ గురించి మండిపడ్డారు.సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం సర్వసాధారణం అయితే అవి హద్దు మీరుకూడదని ఈయన తెలిపారు.ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన సంఘటనలను తెలిపారు.ఒకరోజు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకానొక సమయంలో మా తండ్రి సూసైడ్ చేసుకోవాలనుకున్నారని చెప్పాను.దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ సూసైడ్ చేసుకొని చనిపోయిన దేవదాస్ కనకాల అంటూ థంబ్ నైల్ పెట్టి వార్తలు రాశారు.
![Telugu Divorce, Rajeev Kanakala, Rajeevkanakala, Suma, Trollers-Movie Telugu Divorce, Rajeev Kanakala, Rajeevkanakala, Suma, Trollers-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Rajeev-Kanakala-fires-on-social-media-trollersc.jpg)
ఈ వార్త చూడగానే రిపోర్టర్ కి ఫోన్ చేసి సీరియస్ అవ్వడంతో ఆయన సారీ చెప్పి మార్చేశారు.అలాగే నేను సుమ( Suma ) విడాకులు తీసుకొని విడిపోయాము అంటూ భారీ స్థాయిలో ప్రచారం చేశారని మేమిద్దరం బయట కలిసి కనిపించిన అదేంటి మీరు విడాకులు ( Divorce ) తీసుకున్నారు కదా మళ్ళీ కలిసిపోయారా అనే కామెంట్లు కూడా వచ్చాయని ఈయన వెల్లడించారు.ఇకపోతే ఒక ఫంక్షన్ లో నా కూతురు పాల్గొన్నారు.అయితే తన కూతురిపై కూడా దారుణమైన ట్రోల్స్ రావడంతో తను చాలా బాధపడింది అంటూ ఈ సందర్భంగా రాజీవ్ కనకాల సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.