రక్తహీనత( anemia ).మనం అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి.
రక్తహీనత బాధితుల్లో పిల్లలు మరియు మహిళలే అత్యధికంగా ఉంటారు.రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ కొరత.
శరీరానికి సరిపడా ఐరన్ కంటెంట్ అందించకపోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్( Hemoglobin levels ) పడిపోతాయి.దాంతో రక్తహీనతకు గురవుతారు.
ఫలితంగా నీరసం, అలసట, తరచూ కళ్లు తిరగడం, మానసిక కల్లోలం, ఆయాసం తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.
వాటన్నిటికీ చెక్ పెట్టి రక్తహీనత నుండి బయట పడాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఐరన్ రిచ్ లడ్డూను తీసుకోండి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వేరు శనగలు ( Peanuts )వేయించి పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు నువ్వులు( cup sesame seed ), ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి ( Dry coconut powder )విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పల్లీలు ఆపై నువ్వులు వేసి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పల్లీలు మరియు నువ్వుల పొడిలో ఎండు కొబ్బరి పొడి, ఒకటిన్నర కప్పు బెల్లం పొడి( cup jaggery powder ), పావు టీ స్పూన్ శొంఠి పొడి వేసుకుని అన్నిటినీ కలుపుకోవాలి.చివరిగా అర కప్పు కాచి చల్లార్చిన ఆవు నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుని లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.వీటిని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని రోజుకి ఒకటి చొప్పున తీసుకోవాలి.
ఈ లడ్డూలో ఐరన్ మాత్రమే కాకుండా అనేక రకాల మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
ఈ లడ్డూను రెగ్యులర్ గా తీసుకుంటే ఐరన్ కొరత దూరమవుతుంది.రక్తహీనత సమస్య నుంచి సులభంగా బయటపడతారు.అలాగే ఈ లడ్డూ ఎముకలను దంతాలను బలోపేతం చేస్తుంది.
మెదడు పని తీరును చురుగ్గా మారుస్తుంది.జ్ఞాపకశక్తి ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది.
అంతేకాదు ఈ లడ్డూ శరీరానికి బోలెడంత శక్తిని చేకూరుస్తుంది.నీరసం బారిన పడకుండా అడ్డుకుంటుంది.
మరియు హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడంలో సైతం ఈ లడ్డూ అద్భుతంగా తోడ్పడుతుంది.