ఈ రోజుల్లో ఓవర్ వెయిట్( Over weight ) ఉన్నవారు కొన్ని కిలోల బరువు తగ్గించుకోవడానికే చాలా కష్టపడుతున్నారు.అలాంటిది మిల్లి స్లేటర్ అనే 20 ఏళ్ల యువతి ఏకంగా 48 కిలోలు తగ్గింది.
ఆమె వెయిట్ లాస్ జర్నీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇంగ్లాండ్‌లోని నార్తాంప్టన్‌కు( Northampton, England ) చెందిన ఈ 20 ఏళ్ల యువతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది.
2023 జనవరిలో మిల్లి తన బరువు 114 కిలోలు అని చెప్పింది.కానీ ఆమె దాదాపు 48 కిలోలు వదిలించుకుని, ఇప్పుడు 66 కిలోలకు తగ్గింది.
తన వెయిట్ లాస్ జర్నీని టిక్‌టాక్‌లో పంచుకోవడం ద్వారా అనేక మందికి స్ఫూర్తినిచ్చింది.మిల్లి తన విజయానికి కారణం నిబద్ధత, కఠినమైన రొటీన్ అని చెప్పింది.ఆమె వారానికి ఆరు రోజులు వెయిట్‌ట్రైనింగ్ చేసి, తన కేలరీలను జాగ్రత్తగా లెక్కించింది.అయితే, ఆమె బరువును వేగంగా తగ్గించుకోవడానికి రహస్యం రోజూ ఇంక్లైన్ ట్రెడ్‌మిల్‌పై నడకే.
ఆరోగ్యకరమైన ఆహారం, సరైన ఎక్సర్‌సైజ్ షెడ్యూల్‌ను అనుసరించడం ద్వారా ఆమె తన లక్ష్యాన్ని చేరుకుంది.
మిల్లి( Milli ) మాట్లాడుతూ, “నేను కేలరీల గురించి ఎప్పుడూ పెద్దగా తెలుసుకోలేదు, కానీ రోజుకు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నానో తెలిస్తే నాకే భయం వేస్తుంది. నేను ట్రెడ్‌మిల్‌పై ఇంక్లైన్ వాక్స్ చేయడం మొదలుపెట్టి, తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లోకి వచ్చాను.అప్పుడు జిమ్ బోర్ కొట్టకుండా ఉంది.
గత ఏడాదిన్నరలో నా శిక్షణ చాలా మారిపోయింది, కానీ నేను ఎప్పుడూ రన్ చేయలేకపోయా.ఇంక్లైన్ వాక్స్‌లు కొనసాగించాను.” అని చెప్పింది.
“మీకు నచ్చిన వ్యాయామాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.నేను పరుగెత్తలేను అనుకునేదాన్ని కాబట్టి నాకు బరువు తగ్గే అవకాశం లేదని అనుకున్నాను.కానీ ఎక్కువగా నడవడం, చురుగ్గా ఉండటం ద్వారా అది సాధ్యమే అని తెలుసుకున్నా.
నేను వెయిట్స్ ఎత్తితే బాడీ బిల్డర్ లాగా అవుతానేమో అని కూడా అనుకునేదాన్ని, కానీ అలాంటిదేమీ లేదు.నేను చాలా బలంగా తయారయ్యా, అది నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.నేను ఎప్పుడూ బరువు తగ్గగలనని అనుకోలేదు, ముఖ్యంగా ఇంత ఎక్కువ.” అని మిల్లి స్లేటర్ చెప్పింది.ఒక వ్యాయామం చేయలేకపోతే మీరు చాలా పడాల్సిన అవసరం లేదని నచ్చిన వ్యాయామం చేసుకుంటూ చురుగ్గా ఉంటే చాలు వెయిట్ తగ్గడం సాధ్యమే అని తెలిపింది.ఆరోగ్యకరమైన ఆహారం తినాలని సూచించింది.