నల్లగొండ జిల్లా:కనగల్ మండల( Kanagal) కేంద్రంలో ప్రధాన కూడలిలోని బస్టాండ్ గుంతల్లో వర్షం నీరు నిండి చెరువును తలపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.గుంతలు చిన్నవే అనుకొని అందులో నుండి వెళ్ళిన ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నామని,బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులు ఆ గుంతల్లో నుండి వెళ్ళేటపుడు పేగులు నోట్లోకి వచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు నిత్యం ప్రయాణికులు పడుతున్న అవస్థలు చూస్తూ కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని,ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి గుంతలు పూడ్చి,బస్టాండ్ ఆవరణ మొత్తం కాంక్రీట్ తో నింపినట్లైతే ప్రయాణం సులభం అవుతుందని ప్రయాణికులు కోరుతున్నారు.