సాధారణంగా చాలా సినిమాల్లో హీరోలుగా యాక్ట్ చేసిన తర్వాత ఇక తాము సొంతంగా మూవీలను డైరెక్ట్ చేయగలమనే ఒక నమ్మకం కలుగుతుంది.సీనియర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ధనుష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తమ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా వాటిని సొంతంగా డైరెక్ట్ చేసుకున్నారు.
అయితే వీరిలో కొంతమంది సక్సెస్ అయ్యారు.మరి కొంతమంది మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు.అలాంటి హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• పోసాని మురళీకృష్ణ
పోసాని మురళీకృష్ణ( Posani Muralikrishna ) ఎంత టాలెంటెడ్ పర్సనో మనం స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినిమాల్లో స్క్రీన్ రైటర్, నటుడు, దర్శకుడు, నిర్మాతగా పని చేసాడు.దాదాపు 150 తెలుగు చిత్రాలకు రచయితగా వర్క్ చేసి వాటి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
పోసాని అనేక చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.ఇతడు ఒక సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దాన్ని డైరెక్ట్ చేశాడు.
ఆ సినిమా పేరు మెంటల్ కృష్ణ.అయితే ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది.
![Telugu Adavi Seshu, Jonny, Pawan Kalyan, Tollywood Heros-Telugu Top Posts Telugu Adavi Seshu, Jonny, Pawan Kalyan, Tollywood Heros-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2024/07/Tollywood-heros-who-directed-their-filmc.jpg)
• అడవి శేషు
అడవి శేషు( Adavi seshu ) కూడా చాలా ప్రతిభావంతుడు.అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ కర్మ అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.ఇందులో అతడే హీరో, అతడే డైరెక్టర్ కూడా.కానీ ఈ సినిమా అతనికి తీవ్ర నిరాశ మిగిల్చింది.నిజానికి ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ ఇది ఒకటి రిలీజ్ అయింది అని ఎవరూ తెలుసుకోలేకపోయారు.దీనిని ప్రమోట్ చేయడంలో మూవీ టీం విఫలం అయిందని చెప్పుకోవచ్చు.
![Telugu Adavi Seshu, Jonny, Pawan Kalyan, Tollywood Heros-Telugu Top Posts Telugu Adavi Seshu, Jonny, Pawan Kalyan, Tollywood Heros-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2024/07/Tollywood-heros-who-directed-their-filmd.jpg)
• జానీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎప్పుడూ డైరెక్టర్ అవ్వాలని అనుకునేవాడు.అయితే తన అన్నయ్య, వదినల కోరిక మేరకు హీరోగా నటించడం ప్రారంభించాడు.అతడు హీరోగా మంచి సక్సెస్ సాధించిన తర్వాత డైరెక్టర్ గా మారాలని జానీ సినిమా తీశాడు.ఇందులో హీరోగా కూడా యాక్ట్ చేశాడు కానీ ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చలేదు.
అందువల్ల అది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.ఇది ఆడక పోవడానికి ఈ సినిమాపై ముందుగా పెరిగిపోయిన హైపే కారణం అని చాలామంది అంటారు.