ఉపాధ్యాయులు అంటే తల్లిదండ్రులతో సమానం.ఒక విద్యార్థిని మంచిగా మార్చేందుకు వారు కొట్టడంలో తప్పులేదు కానీ కొట్టకూడని విషయాల్లో చేయి చేసుకోకూడదు.
అయితే ఈ కామన్ సెన్స్ లేని కొంతమంది ఉపాధ్యాయులు చిన్నపిల్లలని కూడా చూడకుండా కష్టంగా ప్రవర్తిస్తారు.తాజాగా అలాంటి ఒక గవర్నమెంట్ టీచర్( Govt Teacher ) కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కలతపెట్టే ఆ లేడీ టీచర్ ప్రవర్తన చూసి చాలామంది షాక్ అవుతున్నారు.
ఈ వీడియో ప్రకారం ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం అడిగినందుకు ఒక మహిళా టీచర్ ( female teacher )చిన్న పిల్లలను తిడుతూ, కొట్టడం కనిపించింది.ట్విట్టర్ యూజర్ అభిమన్యు సింగ్ ( Abhimanyu Singh )షేర్ చేసిన ఈ వీడియోలో టీచర్ పిల్లలపై చాలా సీరియస్ అవడం మనం చూడవచ్చు.“మీకు అలాంటి ఆటిట్యూడ్ ఉంటే, ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లండి, ఇక్కడ మధ్యాహ్న భోజనం చేయకండి.రోజంతా రూ.200 సంపాదించలేరు కానీ బాగా ఆటిట్యూడ్ చూపిస్తున్నారే!” అని చులకనగా మాట్లాడింది.ఈ ఫిమేల్ టీచర్ ప్రవర్తన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులపై హింస, పరుష పదజాలాన్ని ఉపయోగించడం నేరమని కూడా అన్నారు.
మరోవైపు ఒక టీచర్ స్కూల్లో హాయిగా పడుకొని పిల్లల చేత విసనకర్రతో సపర్యలు చేయించుకుంది.ఇటివల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.ప్రతినెలా ఒకటవ తేదీన జీతం పుచ్చుకుని వీళ్ళు పిల్లలకు చదువు చెప్పకుండా ఎంజాయ్ చేస్తున్నారు.ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది.
పేదవాడు పేదవాళ్ల లాగానే మిగిలిపోతారు.భారతదేశ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది.