పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్( Bro The Avatar )’ ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్( Bro Movie Teaser ) ని రీసెంట్ గానే విడుదల చేసారు.
దీనికి ఫ్యాన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే.కేవలం ఒక్కరోజులోనే 30 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ టీజర్.
ఇప్పటికీ ఇది యూట్యూబ్ లో టాప్ 1 స్థానం లోనే ట్రేండింగ్ అవుతూ ఉంది.ఈ టీజర్ కి ముందు ‘బ్రో’ చిత్రం పై పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన రేంజ్ హైప్ మరియు మార్కెట్ ఉండేది కాదు.
కానీ ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి ట్రేడ్ లో మార్కెట్ ఈ చిత్రం పై ఎవరూ ఊహించని రేంజ్ కి చేరింది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో, డైరెక్టర్ సముద్రఖని అదే విధంగా చూపించాడు.అందుకే మార్కెట్ లో ఈ సినిమాపై క్రేజ్ ఊహించని రేంజ్ కి చేరుకుంది.ప్రతీ ప్రాంతం లో కూడా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్( Bro Movie Pre Release Business ) కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుంది.
ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం ఒక ముఖ్య పాత్ర మాత్రమే పోషిస్తున్నాడు.ఆయన పాత్ర సినిమాలో 45 నుండి 50 నిమిషాల వరకు ఉంటుంది.ఆ కొద్దీ సేపు ఉన్నందుకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు పైగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది.కేవలం రాయలసీమ ప్రాంతం హక్కులే 14 కోట్ల రూపాయలకు అమ్మారట.
ఒక రెగ్యులర్ కమర్షియల్ చిత్రానికి కూడా ఈ రేంజ్ రేట్ పలకదని, ఒక క్లాస్ మూవీ కి ఈ స్థాయి రేట్స్ పెట్టి కొనడం ఈమధ్య కాలం లో ఈ చిత్రానికే జరిగిందని అంటున్నారు.

అలాగే తెలంగాణ ప్రాంతం లో కూడా ఈ సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందని చెప్తున్నారు.అలాగే కృష్ణ జిల్లాకు 5 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర జిల్లాకు 10 కోట్ల రూపాయిలు బిజినెస్( Bro Movie Business ) పలుకుతుందని సమాచారం.ఇదంతా టీజర్ తర్వాత జరిగిన బిజినెస్ అట.విడుదలకు ముందే ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని ఈ వారం లోనే విడుదల చెయ్యబోతున్నారు.
తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవబోతుందట.అందులో ఒక పాటలో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి డ్యాన్స్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అందుకు సంబంధించిన షాట్స్ ని కూడా మనం టీజర్ లో చూడవచ్చు.







