భర్త ఆరోగ్యం సంపద కోసం భార్య చేయాల్సిన ఈ ముఖ్యమైన పనుల గురించి తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ధర్మంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.హైందవ సంస్కృతిలో వివాహం అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు.

 Do You Know About These Important Things That A Wife Should Do For Her Husband'-TeluguStop.com

వైవాహిక వ్యవస్థలో మహిళలకు ప్రత్యేక స్థానం కూడా ఇచ్చారు.వివాహిత మహిళని భర్త ( husband )అర్ధాంగి అని అంటారు.

వివాహం తర్వాత భార్య చేసే పని భర్త ఒక్కడినే కాకుండా మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది.కాబట్టి భార్య రోజు మంచి పనులు చేస్తూ ఉండాలి.

ఇది ఆమె భర్తతో పాటు మొత్తం కుటుంబానికి ఐశ్వర్యాన్ని తెస్తుంది.భార్య( wife ) రోజు చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bakthi, Basil Tree, Bhakti, Devotional, Goddess Lakshmi, Husbands, Marrie

ముఖ్యంగా చెప్పాలంటే భార్యా ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి, తులసి పూజ చేసి, తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి.తులసి ఇంటిని కాపాడే పవిత్రమైన మొక్క అని దాదాపు అందరికీ తెలుసు.తెల్లవారుజామున ఈ మొక్కను పూజించి నీళ్లు పోయడం వల్ల లక్ష్మీదేవి( Goddess Lakshmi ) రూపమైన తులసి ఆమెకు, ఆమె కుటుంబానికి ఆనందంతో పాటు శ్రేయస్సును ఇస్తుంది.ఇంకా చెప్పాలంటే వివాహం తర్వాత మహిళలు ఏకాదశి, పౌర్ణమి రోజులలో ఉపవాసాలు పాటించాలి.

ఈ రోజులలో భక్తిశ్రద్ధలతో ఆయా దేవతలను పూజించి ఉపవాసం ఉండడం ఎంతో మంచిది.

Telugu Bakthi, Basil Tree, Bhakti, Devotional, Goddess Lakshmi, Husbands, Marrie

దీని వల్ల వైవాహిక జీవితం ( married life )ఎంతో సంతోషంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే భార్య ఉదయాన్నే లేచి, స్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లోనీ చెత్త చెదరాన్ని తొలగించిన తర్వాత రాగి పాత్రలోని నీటిని తీసుకొని ఆ నీటిని ఇల్లంతా చల్లాలి.దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తులు స్థిరపడతాయి.

ఇది ఇంట్లో చిన్న చిన్న ఆందోళనలను కూడా తొలగిస్తుంది.వివాహిత మహిళలు స్నానం చేయకుండా పూజ గది వంటగదిలోకి ప్రవేశించకూడదు.

ఇంకా చెప్పాలంటే వివాహమైన మహిళ సంధ్యా సమయంలో స్నానం చేయాలి.లేదంటే ముఖం, చేతులు, కాళ్లు కడుక్కోవాలి.

ఆ తర్వాత తులసి మొక్క ముందు, పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి.ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube