తెలంగాణ రాష్ట్రంలో యాసంగి లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తాం అనడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్ కు వడ్ల తో వినూత్నంగా తులాభారం నిర్వహించిన టిఆర్ఎస్ శ్రేణులు.వరంగల్ చౌరస్తాలో టిఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్ కు వడ్లతో తులాభారం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేసినా వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని,1960 రూపాయల మద్దతు ధరతో రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేయనున్నారని, రైతులు ఎవరు మిల్లర్లకు అమ్ముకోకుండా ప్రభుత్వానికి అమ్ముకొని మద్దతు ధర పొందాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంతో లక్షలాది మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఎర్రబెల్లి అన్నారు.







