వారంలో ఒక్క సారి ఇలా చేస్తే పేలు ప‌రార‌వ్వ‌డం ఖాయం!

పేలు.ఎంద‌రినో బాధించే కామ‌న్‌ స‌మ‌స్య ఇది.త‌ల‌లో ఒక్క పేను ప‌డిందంటే చాలు.రెండు, మూడు రోజుల్లోనే కుప్ప తెప్ప‌లుగా పెరిగి పోతుంటాయి.

 Best Ways To Remove Lice From Hair! Hair Lice, Latest News,  Remove Lice, Lice,-TeluguStop.com

వాటి వ‌ల్ల‌ దుర‌ద, ఇరిటేష‌న్ విప‌రీతంగా ఉంటుంది.అలాగే పేలు మ‌న ర‌క్తాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల చాలా మంది ర‌క్త హీన‌త‌కు కూడా గుర‌వుతుంటారు.

అందుకే పేల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో ల‌భించే పేల మందును వాడుతుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే చాలా సుల‌భంగా పేల‌ను పోగొట్టుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఐదు నుంచి ఏడు క‌ర్పూరం బిళ్ల‌ల‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ క‌ర్పూరం బిళ్ల‌ల పొడిలో మూడు స్పూన్ల వాసెలిన్‌ను క‌లిపి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.అర‌గంట పాటు వ‌దిలేస్తే పేలు అన్నీ చ‌చ్చిపోతాయి.

ఆపై కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.వారంలో ఒక్క సారి ఇలా చేస్తే పేల స‌మ‌స్యే ఉండ‌దు.

అలాగే మ‌రో విధంగా కూడా పేల‌ను పోగొట్టుకోవ‌చ్చు.ఐదారు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని పొట్టు తీసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్‌లో అర స్పూన్ మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి గంట పాటు ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

ఆపై మైల్డ్ షాంపూతో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒక సారి చేసినా పేల‌న్నీ పరార్ అవుతాయి.

Best Ways To Remove Lice From Hair! Hair Lice, Latest News, Remove Lice, Lice, Home Remedies For Lice, Home Remedies, Hair Care, Hair Care Tips - Telugu Care, Care Tips, Latest, Remove

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube