ఆ సర్వే రిపోర్ట్ తో కేటీఆర్ ఆందోళన ? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ?

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదు.ఇది తన పనితీరుకు, రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊహించని స్థాయిలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

 Ktr Strong Warning On Ghmc Corporates Who Have Aligations Ktr, Kcr ,ghmc Electi-TeluguStop.com

ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్ లతో తరచుగా ఆయన సమావేశాలను నిర్వహిస్తూ పార్టీ విజయానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే విషయంపై చర్చిస్తున్నారు.

తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల విషయం పై నిర్వహించిన సమావేశంలో కొంతమంది కార్పొరేటర్ల పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సుమారు 15 మంది వరకు కార్పొరేటర్ల పనితీరు ఏమాత్రం బాగోలేదని, వారంతా తమ పద్ధతి మార్చుకోవాలని కేటీఆర్ గట్టిగానే హెచ్చరికలు చేశారు.ఈమేరకు గ్రేటర్ ఎన్నికలు, కార్పొరేటర్ల పనితీరు, ఓటర్ల అభిప్రాయాలు, ఇలా అనేక అంశాల గురించి ఐదు రకాల సర్వేలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది.2016 ఎన్నికలు గ్రేటర్ పరిధిలో 99 స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకుంది.ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కో కార్పొరేటర్ చేరడంతో టిఆర్ఎస్ బలం 101 కి చేరింది.

వీరిలో 15 మందిపై తీవ్రమైన ఆరోపణలు రావడం, వీరి పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడం వంటి వ్యవహారాల పై సమగ్ర సర్వే రిపోర్ట్ రావడంతో, వారందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సర్వే రిపోర్ట్ ప్రకారం 15 మంది కాదని, అంతకంటే ఎక్కువ సంఖ్యలో నే కార్పొరేటర్లు పనితీరు బాగాలేదని రిపోర్ట్ వచ్చిందని, కానీ ప్రజల్లో చులకన అవుతాము అనే అభిప్రాయంతో వాటి సంఖ్య తక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శలు టిఆర్ఎస్ పై లేకపోలేదు.

బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గత ఐదేళ్లలో నగరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఖర్చు చేసింది ? చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ?అనే విషయాలను ప్రస్తావించారు.ప్రజలకు వీటిపై అవగాహన పెంచాలని సూచించారు.ప్రభుత్వానికి పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో మంచి పేరు ఉందని, సర్వేలో కూడా టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయని, మరీ తక్కువ అనుకుంటే 91 పైగా స్థానాలు టిఆర్ఎస్ ఖాతాలో పడబోతున్న ట్లు నివేదికలు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు.

మరోసారి కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించి, టీఆర్ఎస్ గెలుపు కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయంపై దృష్టి సారించబోతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube