ఈ ఫ్యామిలీ ఫోటో ఏ స్టార్ హీరోదో తెలుసా?

ఇంకా గుర్తు పట్టలేదా ? ఇప్పటికే గుర్తు పట్టి ఉండాలి కదా! అతనే అండి మన తెలుగు సినిమాను నిలబెట్టిన హీరో నాగేశ్వర్ రావు! లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి 10 ఏళ్లకే డ్రామా ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించి గొప్ప నటుడుగా అవతారం ఎత్తాడు అక్కినేని నాగేశ్వర్ రావు.

 Akkineni Nageswar Rao Family Photos Viral, Naga Chaitanya Childhood Photos, Akhi-TeluguStop.com

ఎన్టీఆర్ తో పోటీ పడి నటించిన గొప్ప నటుడు నాగేశ్వర్ రావు.కుటుంబంతో పాటు వ్యవసాయ రైతుగా పనులు చేసుకుంటూనే డ్రామాస్ లో అమ్మాయ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఆతర్వాత 17 ఏళ్ల వయసులో ఆయనకు ధర్మపత్ని అనే సినిమాలో చిన్న పాత్ర వచ్చింది.ఆ సినిమా ద్వార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగేశ్వర్ రావు.

ఏఎన్ఆర్ టాలెంట్ ను గుర్తించిన గంటసాల బలరామయ్య గారు సీత రామ జననం సినిమాలో రాముడు పాత్ర ఇచ్చారు.ఆ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నాగేశ్వర్ రావు 1955లో వచ్చిన దొంగ రాముడు చిత్రంతో స్టార్ హీరో అయ్యాడు.

ఆ సినిమా వచ్చిన సంవత్సరంలోనే ఆయన సినిమాలు దాదాపు ఏడు రిలీజ్ అయ్యాయి.
అలా చిన్న వయసులోనే నటన ప్రారంభించిన నాగేశ్వర్ రావు 90 ఏళ్ల జీవితంలో దాదాపు 75 ఏళ్లు సినిమాతోనే ఉన్నారు.

సినీ కెరీర్ పరంగా ఎంత బిజీ గా ఉన్న భర్తగా, తండ్రిగా, తాతగా అన్ని విధాలుగా ఎంతో ఆనందమైన జీవితాన్ని గడిపారు నాగేశ్వర్ రావు గారు.చివరి రోజుల్లో కూడా క్యాన్సర్ సర్జరీ చేయించుకొని మరి అక్కినేని కుటుంబ వారసులు అందరితో ”మనం” సినిమాలో నటించి తుదిశ్వాస వదిలారు.

ఏఎన్ఆర్ అంత గొప్పనటులు లేరు.ఇక రారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube