చక్కటి సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటీమణి కస్తూరి.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది.
ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది.సీరియల్ ఆర్టిస్టుగా మారిపోయింది.
మా టీవీలో ప్రసారం అయ్యే గృహలక్ష్మీ సీరియల్ లో మెయిన్ రోల్ చేస్తుంది.ఈ సీరియల్ ను జనాలు బాగా ఆదరిస్తున్నారు.
మంచి టీఆర్పీ రేటింగ్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.ఈ సీరియల్ బాగా పాపులర్ కావడంతో కస్తూరి తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యింది.
కస్తూరి తెలుగు వెండి తెరపై అద్భుత నటిగా గుర్తింపు పొందింది.1991లో ఆత ఉన్ కోయిలి అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.ఆ తర్వాత 1996లో భారతీయుడు సినిమాలో నటించింది.ఇందులో కమల్ హాసన్ చెల్లిగా యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందింది.పచ్చని చిలుకలు తోడుంటే.అనే పాటలో ఎంతో బాగా నటించింది.
ఈ పాటను జనాలు ఇప్పటికీ మర్చిపోలేదంటే కస్తూరి నటన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.అటు తెలుగులో అన్నమయ్య సినిమాలో నటించింది.
ఇందులో నాగార్జున భార్యగా నటించి ఆకట్టుకుంది.
లేటెస్టుగా గృహలక్ష్మీ సీరియల్ టీమ్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న షోలో పాల్గొంది.తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.ఇందులో కస్తూరి కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.
బాగా ఏడుస్తూ కంట తడి పెట్టుకుంది.మీరు మంచి నటి అయినప్పటికీ.
ఇన్నాళ్లు యాక్టింగ్ కు ఎందుకు దూరం అయ్యారు? అని ఓంకార్ ప్రశ్నించాగానే కస్తూరి బాగా ఎమోషనల్ అయ్యింది.తాను ఇప్పటికి మూడు సార్లు చావును చూసినట్లు చెప్పింది.
అమ్మానాన్నల విషయంలో రెండుసార్లు.పాపని మూడు సంవత్సరాలుగా ఆస్పత్రిలోనే చూసుకుంటున్నట్లు చెప్పింది.
అటు కొడుకు పుట్టినా తననూ చూడలేదని విలపించింది.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఈ కార్యక్రమంలో త్వరలో పూర్తిగా ప్రసారం కానుంది.