2019 ఎన్నికల్లో మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పోటీకి దిగిన సంగతి తెలిసిందే.2014 ఎన్నికల్లో పార్టీ పెట్టినా కానీ అప్పట్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపి టీడీపీ అధికారంలోకి రావటం లో కీలక పాత్ర పోషించారు.2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది.ఇలాంటి దారుణం లో పార్టీ పరంగా మొత్తంగా రాజోలు నియోజకవర్గం లో రాపాక వరప్రసాద్ ఏకైక ఎమ్మెల్యే గా జనసేన తరఫున గెలిచారు.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గా ఉండాలని అసెంబ్లీలో ఎప్పుడూ కూడా పవన్ విభేదించే అంశాలపై ముఖ్యంగా జగన్ పై ఏవైతే విమర్శలు చేశారో వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ జనసేన పార్టీ పరువు తీసేశేసారు.
రాజకీయంగా జనసేన అధ్యక్షుడు పవన్ ఎంతగానో విభేదించే జగన్ ని నిండు అసెంబ్లీలో రాపాక పొగడటం మాత్రమే కాక తన కుమారుడిని వైసీపీలో కూడా జాయిన్ చేయటంతో కార్యకర్తల నుండి ఎంతో వ్యతిరేకత రాపాక పై వచ్చేది.
సోషల్ మీడియాలో చాలాసార్లు పవన్ అభిమానులు రాపాక వరప్రసాద్ తీరును ఎండగట్టారు జరిగింది.ఈ క్రమంలో ఎప్పటినుండో టైము చూస్తున్న పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు పంచాయతీ నాలుగో దశ ఎన్నికలలో రాపాక వరప్రసాద్ కి ఊహించని ఝలక్ ఇచ్చారు.
రాజోలు నియోజకవర్గంలో పది స్థానాల్లో జనసేన మద్దతు దారులు గెలవటం తో పంచాయితీ నాలుగో దశ ఎన్నికలలో రాపాక కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.దీంతో రాజోలు నియోజకవర్గంలో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.