నిన్నటికి నిన్న ఒక్కసారిగా ఏపీ మంత్రులు.ఏమ్మేలేలకి బీపీ పెరిగిపోయిందట.
ఏమి చేయాలో తెలియని స్థితిలో చాలా మంది అందోళన చెందారట.ఏంటి ఆలోచిస్తున్నారు.
బీపీ.మంత్రులు ఏమిటో అర్థం కావడం లేదా.
విషయం ఏమిటంటే.సోమవారం చంద్రబాబు మంత్రులు.
ఎమ్మెల్యేలని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ క్లాసు పీకారట.వచ్చే ఎన్నికల్లో టిడిపి175 నియోజకవర్గాల్లోనూ గెలిచేలా ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేయాలని ఆదేశించారట.
ఇది ఎప్పుడు జరిగే తంతే అంటూ అనుకున్న నాయకులకి మరొక వార్తా చెప్పి చంద్రబాబు బీపీ తెప్పించారట
వచ్చే ఎన్నికల్లో కనుక ఎవరైనా వెనకబడ్డా, ఎన్నికల్లో ఓడినా వాళ్ళ రాజకీయ జీవితం అక్కడి తో అయిపోయినట్లే.ఇక మీ ఆశలు వదిలేసు కోండి అంటూ చెప్పారట.
గెలవని వారు.గెలిపించలేని వాళ్ళు ఎంతటి వారైనా సరే మూట ముల్లి సద్దేసుకోవడమే అనడంతో ఒక్క సరిగా నాయకుల్లో బీపి పెరిగిపోయిందట.
వారిలో ఎప్పుడు లేని అందోళన రగిలిందని టాక్.అసలు చంద్రబాబు ఒక్క సారిగా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే…
అసెంబ్లీలో వైసీపి లేకపోయినా సరే మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని చెప్పిన చంద్రబాబుకి ప్రస్తుతం తమ ఎమ్మెల్యేలు వాళ్ళ చప్పగా సాగుతున్నాయి.
అసెంబ్లీలో వైసిపి లేకపోతే బాగా లేదని టిడిపి సభ్యులే మాట్లాడటం.అదే సమయంలో వైసీపి ఎలాగు లేదు కదా అని నాయకులు అందరు సభకి డుమ్మాలు చేస్తున్నారట దాంతో చంద్రబాబుకి మంట నషాళానికి ఎక్కింది…అంతే.
మంత్రులు, ఎమ్మెల్యేలను తన చాంబర్ కు పిలిపించుకుని సీరియస్ అయ్యారు.అసెంబ్లీ సమావేశాలపై సీరియస్‌నెస్ లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుల్ గా క్లాసులు పీకి టార్గెట్ లు ఫిక్స్ చేసి ఇచ్చి పంపారు.దీంతో ఖంగు తిన్న ఎమ్మెల్యేలు ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారట.
బాబా మజాకానా అంటున్నారు పార్టీ సినియర్ లీడర్స్
.