1.పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఘన స్వాగతం
నల్గొండ జిల్లా పర్యటనకు వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెట్టుగూడ వద్ద ఘన స్వాగతం లభించింది.
2.బీసీ గురుకులాల్లో ఇంటర్ డిగ్రీ ప్రవేశ దరఖాస్తులకు 22 వరకు గడువు
మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
3.నీట్ జేఈఈ సాధనకు డిజిటల్ మెటీరియల్
నీట్ జే ఈఈ 2022 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘ కోట ‘ డిజిటల్ రివిజన్ మెటీరియల్ సిద్ధం చేస్తున్నట్లు ఐఐటి, జేఈఈ , నీట్ ఫోరం ప్రకటించింది.
4.దక్షిణ మధ్య రైల్వేకు ఐదు జాతీయస్థాయి షీల్డ్ లు
గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఐదు విభాగాల్లో పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్ లను సాధించింది.
5.ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలి
తెలంగాణలో పేదల పై వైద్య ఖర్చుల భారం పడకుండా వైద్య విభాగాలు కృషి చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.అలాగే ఆరోగ్యశ్రీ సేవలు మరింతగా పెరగాలని ఆయన సూచించారు.
6.రాజ్యసభకు రవీంద్ర నామినేషన్
రాజ్యసభ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు.
7.బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.దీంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
8.భారత్ లో ఒమి క్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు
భారత్ లోనూ ఒమి క్రాన్ సబ్ వేరియంట్ బి ఏ.4 వైరస్ ను గుర్తించారు.
9.అధికారికంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
దళిత వైతాళికుడిగా ప్రసిద్ధిచెందిన భాగ్యరెడ్డివర్మ జయంతి (మే 22 ) ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
10.ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించండి
తెలంగాణలో ప్రపంచస్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకున్న తమ ప్రయత్నానికి తగిన సహకారం అందించాలని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు.
11.ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు గురువారంతో ముగిసాయి ఈనెల ఆరో తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం మే 24 వరకు జరగనున్నాయి.
12.ఇంజనీరింగ్ ఫీజులపై రాష్ట్ర కమిటీ నిర్ణయమే కీలకం
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ తీసుకోబోయే నిర్ణయమే కీలకం కానుంది.
13.నెలాఖరులోగా గ్రూప్ 4 నోటిఫికేషన్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేసే నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
14.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరణ
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల లోగో ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవిష్కరించారు.
15.పది పదిహేను రోజుల్లో భూముల ఉచిత క్రమబద్ధీకరణ
ప్రభుత్వ భూముల ఉచిత క్రమబద్ధీకరణ కు వచ్చిన దరఖాస్తుల పరిశీలనను పది పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
16.ఆర్ఎంసి భేటీ వాయిదా వేయండి : తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో జలవిద్యుత్ రూల్ కర్వ్ , మిగులు జలాల అంశాన్ని తేల్చేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ తొలి సమావేశం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ఎంసి భేటీని వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాసింది.
17.యూనిఫామ్ పోస్టులకు వయో పరిమితి పెంచండి
యూనిఫామ్ పోస్టులకు వయో పరిమితి లో రెండేళ్ల సడలింపు ఇవ్వాలంటూ హైదరాబాదులోని డిజిపి కార్యాలయం ముందు నిరుద్యోగులు మరోసారి ధర్నా నిర్వహించారు.
18.16 వ విడత శిక్షణకు రండి : కేంద్రం
ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ లో జులై 18 నుంచి ఆగస్టు 12వ తేదీ దాకా జరిగే 16 విడత శిక్షణకు రావాలని తెలంగాణలోని పలువురు అధికారులకు కేంద్రం కబురు పంపింది.
19.కెసిఆర్ దేశవ్యాప్త పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు.
20.ఏపీ గవర్నర్ తో వై వి.బి.రాజేంద్రప్రసాద్ భేటీ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఈరోజు రాజ్ భవన్ లో భేటీ అయ్యారు.