దేశంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ప్రధాన మంత్రి మోడీ ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ కార్యక్రమం అంతా ఎంతో వైభవంగా జరిగింది.
ఎంతో పండుగ వాతావరం సంతరించుకున్న ఈ కార్యక్రమం.అంతా చాలా బాగా జరిగింది.
మోడీ కూడా ఏర్పాట్లపై.మెట్రో రైలు విషయంలో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కేసీఆర్ ముఖం అయితే తారా జువ్వలా వెలిగి పోయింది.ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎక్కడో చిన్న లోటు.
వెలితిలా అనిపించింది.అలా ఎలా జరిగింది అంటూ ఎంతో మంది ఎన్నో ప్రశ్నలని తమని తాము ప్రశ్నించుకున్నారు
మెట్రో రైలు ప్రారంభించడానికి వచ్చిన మోడీకి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సాదర స్వాగతం పలికారు.సిఎం కేసిఆర్.
గవర్నర్ నర్సింహ్మన్.స్పీకర్ మధుసూదనాచారి.
శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్.డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగరర్, ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కేటిఆర్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు.
అనేక మంది మోడీకి స్వాగతం పలికారు.అంతేకాదు రాష్ట్ర బిజెపి నాయకులు కిషన్ రెడ్డి,దత్తాత్రేయ,కృష్ణంరాజు,లక్ష్మణ్.
అందరు ప్రధానిని కలిశారు.అయితే ప్రధాని తన బిజేపీ నాయకులతో ఏకాంతంగా కాసేపు చర్చించారు.
కూడా ఇదంతా బాగానే ఉంది కానీ ఈ వేడుకలో ఒక వ్యక్తి మాత్రం మిస్ అయ్యాడు ఆయనే తెలంగాణ ఇరిగేషన్ శాఖ, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు.ఇప్పుడు హరీష్ రావు లేకపోవడం.
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.మోడీ పర్యటనలో సిఎం కేసిఆర్, ఆయన తనయుడు, ఐటిశాఖ మంత్రి కేటిఆర్ అన్నీ తామై ముందుండి నడిపించారు
మెట్రో రైలులో ప్రయాణించే సమయంలో మంత్రి కేటిఆర్ మోడీ పక్కనే కూర్చుని అన్ని విషయాలను ప్రధానికి వివరించారు.
కానీ మంత్రి హరీష్ రావు మాత్రం ఈ దరిదాపుల్లోకి కూడా రాలేదు.ఆయన ఎందుకు రాలేదబ్బా అన్న చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది.
విమానాశ్రయంలో స్వాగతం పలికే సమయంలో ఆయన కనిపించలేదు.తర్వాత మెట్రో రైలు ప్రయాణం సందర్భంగా కనిపించలేదు.
తెలంగాణ ప్రభుత్వానికి సంభందించిన అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉన్నారు కానీ హరీష్ రావు రాకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.ఎన్నో అనుమానాలని కలిగించింది
హరీష్ ఎందుకు రాలేకపోయారు అనే విషయంపై మరొక ఆసక్తి కరమైన విషయం తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు వచ్చిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని సంబంధిత శాఖ వర్గాలు చెబుతున్నాయి.కానీ ఇక్కడకి ప్రధాని వస్తున్నా సమయంలో.
ఎంతో ప్రతిష్టాత్మకత సంతరించుకున్న రోజునే హరీష్ వెళ్ళడం ఎందుకు మరొక రోజు వెళ్ళే అవకాశం ఉంది కదా అంటూ గుస గుసలు వినిపించాయి.మొత్తానికి హరీష్ రావు మోడీ ప్రోగ్రామ్ లో లేకపోవం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది.
దీనికి రీజన్ ఏంటి అనేది ఎప్పుడు బయట పడుతుందో వేచి చూడాల్సిందే.







