అవును! ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విషయంపై చర్చ సాగుతోంది.వైసీపీ అధినేత జగన్‌ను అధికారంలోకి తీసుకురావాలని కలలుకన్న రెడ్డి సామాజికవర్గం.
ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రెండు గా చీలిపోయిందని అంటున్నారు పరిశీలకులు.అది కూడా అత్యంత నమ్మకంగా ఉండే.
ఓ మీడియా అధినేత ఒకరు జగన్‌కు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు.ఈయనకు వైసీపీలో … రెడ్డి సామాజికవర్గంలో గట్టి పట్టుంది.
ఇతర పార్టీల నుంచి… వైసీపీలోకి వచ్చేలా ప్రోత్సహించేందుకు ఈ మీడియా అధినేత ప్రధాన పాత్ర పోషించారనేది అందరికీ తెలిసిందే.
అదే సమయంలో టీడీపీపై నిత్యం నిప్పులు చెరుగుతూ.
చంద్రబాబు పని అయిపోయిందనే రీతిలో కథనాలు వండి వార్చిన మీడియాగా కూడా గుర్తింపు పొందింది.వైసీపీకి అంతగా బాకా ఊది బాగా పని చేసిన ఈ మీడియా.
ఇప్పుడు యాంటీ లైన్ ఎంచుకుంది.అంటే.
జగన్‌కు వ్యతిరేకంగా మారిపోయింది.దీనికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి.ఏపీలో హిందూ మతానికి జరుగుతోన్న అన్యాయం… వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో ఉండడం… రెడ్డి సామాజిక వర్గానికి ఆశించిన విధంగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమేనని ఓ టాక్ ?

అయితే.ఈ వ్యతిరేకత సదరు మీడియా అధినేతతోనే పోలేదు.గతంలో తను పోరు పెట్టి మరీ కొందరు రెడ్డి సామాజిక వర్గం నేతలను వైసీపీలోకి చేర్చిన వారిని కూడా ఇప్పుడు బయటకు లాగేసేందుకు.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.ప్రకాశం, నెల్లూరు, గుంటూరు రెడ్లలో కొందరు వేర్వేరు పార్టీల నుంచి వచ్చి.వైసీపీలో చేరిపోయారు.అయితే.
వారికి పార్టీలో ప్రాధాన్యం లేదు.
ఇప్పుడు వీరందరినీ పోగేసుకుని.
జగన్‌పై వ్యతిరేక బావుటా ఎగురవేసే క్రమంలో ఉన్నారట.సదరు మీడియా అధినేత.
ఈ క్రమంలో ఇటీవల ఆయన పంథాను పూర్తిగా మార్చుకున్నారు.జగన్‌కు వ్యతిరేకంగా వార్తలు పడుతుండడం గమనార్హం.
మొత్తానికి ఈ పరిణామం.ముదిరితే.
జగన్‌కు ఇబ్బంది తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.